కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరంగం
మైక్ కట్ చేశారని రచ్చ..
సహనం కోల్పోయిన ఎమ్మెల్యే.. పోడియం పడేసి హల్చల్!
ఉత్తరాఖండ్: ఓ అధికారిక కార్యక్రమం వేదికపై అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. తన ప్రసంగం మధ్యలో మైక్ ఆపేశారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే(Congress MLA Harish Dhami) తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హాజరైన కార్యక్రమంలోనే ఈ ఘటన జరగడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వేదికపైనే హంగామా సృష్టించారు.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరాఖండ్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీశ్ ధామి (Harish Dhami) కార్యక్రమంలో ప్రసంగిస్తున్న సమయంలో తన మైక్రోఫోన్‌ను నిలిపివేశారని ఆరోపించారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు. అక్కడే ఉన్న Sound System ఆపరేటర్లపై చేయి చేసుకున్నట్లు సమాచారం. అంతటితో ఆగకుండా వేదికపై ఉన్న Podiumను కూడా కిందకు పడేశారు. దీంతో కార్యక్రమంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఏం జరుగుతుందో అర్థంకాక అక్కడున్నవారు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.
ముఖ్యమంత్రి సమక్షంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది. ప్రజాప్రతినిధిగా సంయమనం పాటించాల్సిన వ్యక్తి ఇలా బహిరంగ వేదికపై ప్రవర్తించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మైక్ నిలిపివేశారనే ఆరోపణ నిజమేనా? కార్యక్రమ నిర్వాహకులు ఉద్దేశపూర్వకంగా అలా చేశారా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనా ఈ ఘటనతో కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యవహారశైలి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.