జిమ్‌లో విషాదం.. వైరల్ వీడియో
జిమ్‌లో వ్యాయామం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన యువతి..
ట్రెడ్‌మిల్‌పై చిన్న పొరపాటు పెను విషాదం
జిమ్‌కు వెళ్లి Fitness కోసం వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిదే. కానీ అక్కడ చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందో ఇండోనేషియాలో జరిగిన ఈ ఘటన తీవ్రంగా గుర్తుచేస్తోంది. ట్రెడ్‌మిల్‌పై వర్కౌట్ చేస్తుండగా అదుపుతప్పిన 22 ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోయింది.
వివరాల్లోకి వెళ్తే.. ఇండోనేషియాలోని ఓ జిమ్‌లో యువతి మూడో అంతస్తులో ఉన్న ట్రెడ్‌మిల్‌పై వ్యాయామం చేస్తోంది. ఈ క్రమంలో ఒక్కసారిగా ఆమె బ్యాలెన్స్ కోల్పోయి వెనక్కి పడిపోయింది. అయితే ట్రెడ్‌మిల్ వెనుకవైపు తెరిచి ఉన్న కిటికీ ఉండటంతో ఆమె నేరుగా మూడో అంతస్తు నుంచి కిందపడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువతిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయినప్పటికీ పరిస్థితి విషమించడంతో ఆమె మృత్యువాత పడింది.
ఈ ఘటన Gym Safety, Fitness Center Layoutపై కీలక ప్రశ్నలు లేవనెత్తుతోంది. ట్రెడ్‌మిల్‌ను కిటికీలు, గోడల అంచులు లేదా ప్రమాదకరమైన ప్రదేశాలకు సమీపంలో ఏర్పాటు చేయడం ఎంతటి ముప్పును కలిగిస్తుందో ఈ విషాదం తెలియజేస్తోంది. వ్యాయామం ప్రారంభించే ముందు ట్రెడ్‌మిల్ చుట్టూ తగినంత ఖాళీ స్థలం ఉందా, వెనుకవైపు భద్రతా ఏర్పాట్లు ఉన్నాయా, ఎమర్జెన్సీ స్టాప్ పనిచేస్తుందా అనే విషయాలను తప్పనిసరిగా పరిశీలించాలి. Fitness కంటే ముందు Safetyకి ప్రాధాన్యత ఇవ్వాలనే హెచ్చరికగా ఈ ఘటన నిలుస్తోంది.