కొండగట్టు అంజన్న భక్తులకు కీలక సూచన
15-11-2026 | 08:50am
నవంబర్ 15(విజయక్రాంతి): మల్యాల చందనోత్సవం, మహా సంప్రోక్షణ నేపథ్యంలో నవంబర్ 15 నుంచి 20 వరకు కొండగట్టు ఆలయంలో ఆర్జిత సేవలు, వాహన పూజలు, వీఐపీ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఆరు రోజులు మూలవిరాట్టు దర్శనాలు కూడా ఉండవని, భక్తుల కోసం బాలాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. సిఫారసు లేఖలను పరిగణనలోకి తీసుకోబోమన్నారు. నవంబర్ 21 నుంచి యథావిధిగా సేవలు, వాహన పూజలు ప్రారంభమవుతాయని, నిజరూప దర్శనానికి అవకాశం ఉంటుందని తెలిపారు. భక్తులు ఆలయ అధికారులకు సహకరించాలని దేవస్థానం కోరింది.