ఫిలిప్పీన్స్‌లో మోదీ బిజీబిజీ
- ఆసియాన్-భారత్ సదస్సు
- తూర్పు ఆసియా సదస్సు
- మనీలాలో ఘన స్వాగతం
- భారత్-ఆసియాన్ బంధాలకు కొత్త ఊపు
- సముద్ర భద్రతపై వ్యూహం
- క్వాడ్ సమావేశంపై ఆసక్తి
- ట్రంప్‌తో భేటీకి ప్రాధాన్యత
న్యూఢిల్లీ, మనీలా, నవంబర్ 16: ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ఫిలిప్పీన్స్‌లో(Philippines) బిజీబిజీగా గడుపుతున్నారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరుగుతున్న ఆసియాన్ శిఖరాగ్ర సమావేశాల్లో(ASEAN Summit) పాల్గొనేందుకు ఆయన వెళ్లారు. ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు జరుగుతున్న ఈ సమావేశాల్లో అంతర్జాతీయ దౌత్య, ఆర్థిక, భద్రతా(International diplomatic, economic, and security) పరంగా ఆసియా దేశాలు(Asian countries) అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా 23వ ఆసియాన్-భారత్ సదస్సు, 21వ తూర్పు ఆసియా సదస్సుల్లోనూ ప్రధాని పాల్గొంటారు.
వాణిజ్యం, పెట్టుబడులు, సముద్ర భద్రత, రక్షణ సహకారం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్.మార్కోస్ జూనియర్ ఆహ్వానం మేరకు మనీలా చేరుకున్న ప్రధాని మోదీకి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.
ఆయనకు ఫిలిప్పీన్స్ సామాచార, ప్రసార సాంకేతిక శాఖ మంత్రి రాబర్ట్ జోసెఫ్ జే.మోంటెస్ డి కార్లో స్వాగతం పలికారు. అనంతరం ప్రవాస భారతీయులతో మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సభ్య దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం అమలులో పురోగతి, రానున్న ఐదేళ్ల కోసం ప్లాన్ ఆఫ్ యాక్షన్ అమలుపై ఆసియాన్-భారత్ సదస్సులో చర్చలు జరుగుతాయి.
ఇండో-యూఎస్ వాణిజ్యంపై చర్చ
ఆసియాన్ దేశాలతో ఆర్థిక, వాణిజ్య, సాంకేతిక, సాంస్కృతిక, రక్షణ రంగాల్లో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా వ్యూహాత్మక భాగస్వామ్యం దిశగా భారత్ ప్లాన్ చేస్తోంది. సముద్ర నిఘా, సంయుక్త గస్తీ, సముద్ర మార్గాల భద్రత, సముద్ర దొంగతనాల నివారణ, అక్రమ చేపల వేట నియంత్రణ వంటి అంశాల్లో సహకారాన్ని పెపొందించుకునే దిశగా నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా చైనా సముద్రంలో చైనా ప్రభావం, ప్రాదేశిక వివాదాలు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌తో రక్షణ సహకారం ఆసియాన్ దేశాలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలతో కూడిన క్వాడ్ నాయకుల సమావేశంపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మోదీ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇండో-యూఎస్ మధ్య వాణిజ్య సంబంధాలు, సుంకాల అంశాలు, రక్షణ భాగస్వామ్యం వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. మనీలా చేరుకోగానే ప్రవాస భారతీయులతో మోదీ సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలను బలోపేతం చేస్తున్న ప్రవాసుల కృషిని ప్రధాని అభినందించారు.