ఇది ప్రజా ఉద్యమం
డ్రగ్స్‌పై సమర శంఖం
140 కోట్ల మంది భాగస్వామ్యంతో డ్రగ్స్‌పై సమరం
మత్తు మాఫియాకు చరమగీతం పాడుదాం
యువతను కాపాడుకుందాం
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిలుపు
- హైదరాబాద్‌లో మొదలైన నషా ముక్త్ భారత్ పాదయాత్ర
- తొలి రోజు అంబర్పేట్ నుంచి ముషీరాబాద్ వరకు..
- ప్రారంభించిన సినీ నటుడు వెంకటేష్
- విద్యార్థులు, అధ్యాపకులు, స్వామీజీల సంఘీభావం
- యువతే దేశ భవిష్యత్తు: బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు
- భారత్‌పై శత్రుదేశాల కుట్రలు: ఎంపీ లక్ష్మణ్
- పంజాబ్ పరిస్థితులు రావొద్దు: ఎంపీ ఈటల రాజేందర్
హైదరాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): ‘నషా ముక్త్ భారత్(Drug-Free India)’ రాజకీయ కార్య క్రమం కాదని, ఇది 140 కోట్ల భారతీయుల ప్రజా ఉద్యమమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Union Minister Kishan Reddy) స్పష్టం చేశారు. డ్రగ్స్ మహమ్మారి నుంచి దేశ భవిష్యత్తు అయిన యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పిలుపునిచ్చారు. ‘డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్-డ్రగ్స్ ఫ్రీ ఇండియా(Drug-Free Hyderabad – Drug-Free India)’లక్ష్యంగా హైదరాబాద్ వాక్స్(Hyderabad Walks) పేరుతో తలపెట్టిన పాదయాత్రలో ఆయన ప్రసంగించారు. డ్రగ్స్ మహమ్మారి సమాజాన్ని పట్టిపీడిస్తుందని.. తయారీదారులు, సరఫరాదారుల అంతం చూడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
మూడు రోజుల పాదయాత్రలో భాగంగా తొలి రోజు బుధవారం అంబర్పేట్ నుంచి ముషీరాబాద్ వరకు యాత్ర కొనసాగింది. పాద యాత్రకు విద్యార్థులు, యువత, ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ‘సే నో టు డ్రగ్స్’ ప్లకార్డులు ప్రదర్శిస్తూ డ్రగ్స్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. తొలుత అంబర్‌పేట్‌లోని మహంకాళి ఆలయంలో కిషన్‌రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సినీ నటుడు వెంకటేష్ పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ లు డా. కే లక్ష్మణ్, ఈటల రాజేందర్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీజేపీ నేత లు, సినీ తదితర రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాదయాత్రలో పాల్గొ న్నారు. అంబర్పేట్ నుంచి మొదలైన పాదయాత్ర.. ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్టస్ కాలేజ్, ఇఫ్లూ యూనివర్సిటీ, గాంధీ ఆస్పత్రి మీదుగా ముషీరాబాద్‌లోని కశిష్ ఫంక్షన్ హాల్ వరకు కొనసాగింది. మార్గమధ్యలో యువత, విద్యార్థులు, ప్రజలతో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞలు చేయించారు. కిషన్‌రెడ్డి వారిని ఉద్దేశించి మాట్లాడారు.
భావితరాల రక్షణకు ఏకం కావాలి
దేశ జనాభాలో 25 శాతానికి పైగా ఉన్న విద్యార్థులను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కొంతమంది దుర్మార్గులు, దేశద్రోహులు డబ్బు కోసం చాక్లెట్లు, బిస్కెట్ల రూ పంలో అమాయకులైన విద్యార్థులకు మత్తుపదార్థాలు అలవాటు చేస్తున్నారని ఆవేదన చెందారు. 2047 నాటికి దేశాన్ని ’వికసిత్ భారత్’గా తీర్చిదిద్దాలంటే యువతను కాపాడుకోవాలన్నారు. అందకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలపునిచ్చారు.
వెంకటేష్ రాక శుభపరిణామం
డ్రగ్స్ మహమ్మారికి వ్యతిరేకంగా ఒక చేత పుస్తకాలు, మరో చేత పిడికిలి బిగించి ఉద్యమంలోకి అడుగుపెట్టిన విద్యార్థులందరికీ పాదాభివందనం చేస్తున్నానని కిషన్ రెడ్డి తెలిపారు. డ్రగ్స్ వ్యతిరేక పోరాటానికి మద్దతుగా పాదయాత్రలో సినీ నటుడు విక్టరీ వెంకటేష్ పాల్గొనడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఉస్మానియా వర్సిటీ వద్ద విద్యార్థులతో కిషన్‌రెడ్డి మాట్లాడారు. డ్రగ్స్ మహమ్మారి వల్ల పంజాబ్‌లో పరిస్థితి దారుణంగా తయారైందని వివరించారు. డ్రగ్స్ వల్ల వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబాలు, సమా జం తీవ్రంగా నష్టపోతుందని వివరించారు. ప్రతి గ్రామం నుంచి పార్లమెంట్ వరకు, పాఠశాల నుంచి లోక్‌సభ వరకు డ్రగ్స్ వ్యతిరేక పోరాటం విస్తరించాలని కోరారు. అనంతరం విద్యార్థులు, యువత, ప్రజలతో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు.
దేశ ప్రగతిపై కుట్రలు: ఎంపీ లక్ష్మణ్
రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ ఆర్థిక ప్రగతి, యువశక్తిని దెబ్బతీసేందుకు శత్రుదేశాలు, దేశద్రోహులు కుట్ర పన్నుతున్నారని పేర్కొన్నారు. అందుకోసం మాదకద్రవ్యాలను ఆయుధంగా వాడుకుంటున్నారని ఆందోళన చెందారు. అమాయకులైన విద్యార్థులు ఇష్టపడే చాక్లెట్లు, ఐస్క్రీంలలో డ్రగ్స్ కలుపుతున్నారని తెలిపారు. పిల్లల ప్రవర్తన, నడవడికను గమనిస్తుండాలని తల్లిదండ్రులకు సూచించారు. 2029 నాటికి ’డ్రగ్ ఫ్రీ ఇండియా’ లక్ష్య సాధనలో రాష్ట్రంలో ’ఈగల్ ఫోర్స్’ డేగకన్నుతో పనిచేస్తోందని అన్నారు.
‘నషా ముక్త్’ తెలంగాణ: బండారు
మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. ‘నషా ముక్త్ భారత్’ లక్ష్యం నెరవేరాలంటే ముందుగా ’నషా ముక్త్ తెలంగాణ’ సాధించాల్సిన అవసరం ఉందన్నారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత శారీరకంగా, మానసికంగా దెబ్బతినడమే కాకుండా, వారిలోని నైపుణ్యాలు, సృజనాత్మకత, ఆలోచనా సామర్థ్యాలు క్షీణించే ప్రమా దం ఉందన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు తెలంగాణలో ప్రభుత్వం మరింత చొరవ తీసుకోవాలి, విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.
యువతే బలం: రాంచందర్‌రావు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు యువత, విద్యార్థులపైనే ఆధారపడి ఉందని, వారు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల వ్యతిరేక పోరాటాన్ని కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా, సామాజిక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఈ ఉద్యమంలో విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున భాగస్వాములై మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై సమాజంలో అవగాహన కల్పించాలని కోరారు. మోదీ ప్రారంభించిన ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో ముందుకు సాగుతుండటం సంతోషకరమన్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ తరఫున ఈ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా సమాజహితం కోసం సాగుతున్న ఈ మాదకద్రవ్యాల వ్యతిరేక పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
డ్రగ్స్‌కు నో జీవితానికి ఎస్: వెంకటేశ్
ప్రముఖ సినీ నటుడు విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి యువతే అతిపెద్ద బలమని, ప్రభుత్వం కల్పిస్తున్న విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. డ్రగ్స్ బాధితుల కుటుంబాలు, స్నేహితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వ్యసనానికి బానిసైన వారిని దూరం పెట్టకుండా అండగా నిలిచి బయటపడేందుకు సహాయం చేయాలని కోరారు.
యువతకు మీ జీవితం ఎంతో విలువైనది.. ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రగ్స్‌కు ఆకర్షితులు కావద్దని, స్నేహితుల ఒత్తిడికి లొంగకుండా తమ లక్ష్యాలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు గమనిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకోవాలన్నారు. 2029 నాటికి డ్రగ్స్ రహిత భారత్ కోసం మోదీ, అమిత్ షా, కిషన్ రెడ్డి చేపట్టిన ఉద్యమానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని అన్నారు.
నార్కో టెర్రరిజం: బీజేఎల్పీ నేత ఏలేటి
ఓయూ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన బీజేపీఎల్పీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, విదేశాల నుంచి డ్రగ్స్ అక్రమ దిగుమతి ’నార్కో టెర్రిజం’ రూపంలో కొత్త ముప్పుగా పరిణమిస్తోందని హెచ్చరించారు. గతంలో మావోయిజం, నక్సలిజం, ఉగ్రవా దం వంటి వివిధ రూపాల్లో దేశంపై దాడులు జరిగాయని, ప్రస్తుతం విదేశాల నుంచి డ్రగ్స్ అక్రమంగా దిగుమతి అవుతూ దేశానికి కొత్త ముప్పుగా పరిణమిస్తోందన్నారు. 2029 నాటికి డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించాలన్న ప్రధాని మోదీ పిలుపునకు యువత సంఘీభావం తెలపాలని కోరారు.
ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి: ఎంపీ ఈటల రాజేందర్
ఉస్మానియా వర్సిటీ ప్రాంగణంలో ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. డ్రగ్స్ నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని అన్నారు. గ్రీన్ రెవల్యూషన్‌తో వ్యవసాయ రంగంలో విశేష ప్రగతి సాధించిన పంజాబ్ రాష్ట్రం సైతం డ్రగ్స్ మహమ్మారి కారణంగా తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఆ ప్రభావం ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థతో పాటు యువత భవిష్యత్తుపై తీవ్ర పరిణామాలు చూపిందని తెలిపారు. ఇటువంటి పరిస్థితులు మన రాష్ట్రంలో, దేశంలో పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి, తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు భాగస్వాములై డ్రగ్స్‌పై పోరాడాలని పిలుపునిచ్చారు.
ప్రముఖుల మద్దతు
పాదయాత్రకు సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. నిఖిల్, పాయల్ రాజ్‌పుత్ తదితరు లు కిషన్‌రెడ్డితో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. అదే విధంగా ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ఎం.కుమార్, ఇఫ్లూ వీసీ నాగరాజు, సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం వీసీ వైఎల్ శ్రీనివాస్ సహా, ప్రొఫెసర్లు, విద్యార్థులు, బోధనేతర సిబ్బంది మద్దతు తెలిపారు. సితాఫల్ మం డిలోని మోడల్ స్కూల్లో మధ్యా హ్న భోజన విరామం అనంతరం కిషన్‌రెడ్డి పాదయాత్రను తిరిగి ప్రారంభించారు.
చిలకలగూడ మీదుగా సాగిన యాత్రకు స్థానికులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో పాటు మహిళలు రోడ్డుకు ఇరువైపులా వేదికలు ఏర్పాటు చేసి బ్రహ్మరథం పట్టారు. సీతాఫల్మండిలో రోడ్డు పక్కన ఓ టీ కొట్టు వద్ద కిషన్‌రెడ్డి కాసేపు ఆగారు. చాయ్ తాగుతూ అక్కడున్న వారితో సరదాగా ముచ్చరటించారు. చిలకలగూ డ చౌరస్తాలో పాదయాత్రకు పూజ్యశ్రీ శంకర్ స్వామీజీ, పూ జ్యశ్రీ యోగేష్ ప్రభుజీ, పూజ్యశ్రీ శివ స్వామి, పూజ్యశ్రీ విశ్వాత్మానంద గిరి స్వామీజీ, పూజ్యశ్రీ కృష్ణ చాముండేశ్వర మహర్షి, పూజ్యశ్రీ ఆత్మారాం మహారాజ్‌తో పాటు పలువురు స్వా మీజీలు, ఆధ్యాత్మిక వేత్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు.
ఢమరుకం, త్రిశూలాన్ని అందజేశారు. అనంతరం బోయిగూడ కమాన్, గాంధీ ఆసుపత్రి, ముషీరాబాద్ చౌరస్తాల మీదుగా కశిశ్ ఫంక్షన్ ఫంక్షన్ హాల్ వరకు యాత్ర కొనసాగింది. తొలి రోజు మొత్తం 13 కి.మీ మేర పాదయాత్ర కొనసాగింది. అనంతరం యాత్రపై కిషన్‌రెడ్డి సమీక్షించారు. గురు, శుక్రవారం ముషీరాబాద్ నుంచి అమీర్‌పేట్ మీదుగా జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్ వరకు పాదయాత్ర కొనసాగనుంది.