పత్రాలివ్వకుండా విచారణకు పిలిస్తే ఎలా?

26-11-2026 | 05:10am
  1. అంబేడ్కర్ ప్రశ్నలకు ఏసీబీ సమాధానమేది?
  2. మూడుసార్లు పిలిచినా రాలేదంటూ ప్రకటన..
  3.  పత్రాలు కోరినా స్పందించలేదంటూ మాజీ ఏడీఈ
  4. ఫిర్యాదుదారుడినే సాక్షి నంబర్ 3గా పరిమితం చేశారంటూ అభ్యంతరం
  5. నవంబర్ 21న జాయింట్ డైరెక్టర్‌కు లేఖ.. విచారణ తీరుపై కీలక ప్రశ్నలు

హైదరాబాద్ సిటీ బ్యూరో , నవంబర్ 25 (విజయక్రాంతి): అవినీతి అక్రమాలను(corruption and irregularities) వెలుగులోకి తెచ్చేందుకు ఫిర్యాదు చేసిన వ్యక్తికే విచారణలో న్యాయం జరగకపోతే ఎలా? తన ఫిర్యాదుతోనే విచారణ ప్రారంభమైందని చెబుతున్న విద్యుత్ శాఖ మాజీ ఏడీఈ ఇ. అంబేడ్కర్(E. Ambedkar, former ADE of the Electricity Department) ఇప్పుడు ఏసీబీ అధికారుల(ACB officials) తీరుపై ప్రశ్నలు సంధిస్తున్నారు. రూ.30 లక్షల లంచం వ్యవహారంలో ఏసీబీ ఇన్స్పెక్టర్ సుధీర్కుమ్పా వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అంబేడ్కర్ చేసిన ఫిర్యాదు కీలకంగా మారింది.

అయితే, విచారణకు మూడుసార్లు పిలిచినా ఆయన హాజరుకాలేదంటూ ఏసీబీ ప్రకటించడంతో వివాదం కొత్త మలుపు తిరిగింది. విచారణకు అవసరమైన పత్రాలు అడిగినా ఇవ్వలేదని, అలాంటప్పుడు తాను ఎలా హాజరవ్వాలని అంబేడ్కర్ నిలదీస్తున్నారు. ఈనెల 21న ఏసీబీ జాయింట్ డైరెక్టర్కు రాసిన లేఖతో ఆ యన తన వాదనను స్పష్టం గా వెల్లడించారు.

పత్రాలివ్వకుండా హాజరు కావాలంటే ఎలా?

ఈ నెల 6, 10, 17 తేదీల్లో విచారణకు రావాలని తనకు మౌఖికంగా సమాచారం ఇ చ్చినట్లు అంబేడ్కర్ అంగీకరిస్తున్నారు. అయితే, విచారణ కు హాజరై వాంగ్మూలం ఇవ్వాలంటే సం బంధిత పత్రాలు అవసరమని ఆయన చెబుతున్నారు. ఛార్జ్ మెమో ప్రతితో పా టు విచారణాధికారి నియామక ఉత్తర్వు లు, ఇతరుల వాంగ్మూలాల ప్రతులు అం దించాలని ఈ నెల 7, 17 తేదీల్లో అధికారులకు వినతిపత్రాలు సమర్పించినట్లు వెల్లడించారు.

అయినప్పటికీ ఒక్క పత్రం కూడా అందలేదని ఆయన ఆరో పిస్తున్నారు. విచారణలో ఏ అంశాలపై ప్రశ్నించబోతున్నా రు? తన ఫిర్యాదుకు సంబంధించిన వివరాలు ఏమిటి? ఇతరుల వాంగ్మూలాల్లో ఏముంది? అన్న కనీస సమాచారం లేకుండా విచారణకు హాజరై ఏం చెప్పాలని ఆయ న ప్రశ్నిస్తున్నారు. అవసరమైన పత్రాలు అందించకుండా విచారణకు రాలేదని చెప్పడం ద్వారా అసలు సమస్యను పక్కదారి పట్టిస్తున్నారన్నది అంబేడ్కర్ వాదన.

ఫిర్యాదు చేసిన వ్యక్తికే ఈ పరిస్థితా?

ఈ వ్యవహారంలో అంబేడ్కర్ లేవనెత్తిన మరో ముఖ్య మైన అభ్యంతరం ఆయన హోదాకు సంబంధించినది. గత జూన్ 20న తాను ఇచ్చి న ఫిర్యాదు, సమర్పించిన ఆడియో, వీడియో ఆధారాలతోనే విచారణ ప్రారంభమైం దని ఆయన చెబుతున్నారు. అలాంటప్పుడు తనను అసలు ఫిర్యాదుదారుడిగా గుర్తించకుండా కేవలం ‘శాఖాపరమైన సాక్షి నంబర్3’గా పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఫిర్యాదు చేసిన వ్యక్తి అందించిన ఆధారాల ఆధారంగా విచారణ సాగుతున్నప్పుడు, అదే వ్యక్తికి విచారణలో ఏ స్థానం కల్పించారన్నది కీలక ప్రశ్నగా మారింది. ఫిర్యాదుదారుడిగా తన వాదనను పూర్తిస్థాయిలో వినకుండా సాక్షి హోదాకు పరిమితం చేయడం ఎందుకని అంబేడ్కర్ నిలదీస్తున్నారు. ఈ అంశంపై ఏసీబీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.

లేఖతో బయటపడ్డ మరో కోణం

ఏసీబీ ప్రకటన తర్వాత అంబేడ్కర్ ఈ నెల 21న జాయింట్ డైరెక్టర్ (నార్త్ అండ్ ఈస్ట్ జోన్) టి. సాయి మనోహర్కు రాసిన లేఖను బయటపెట్టారు. విచారణకు హాజరుకాకపోవడానికి గల కారణాలను అందులో వివరించారు. పత్రాలు అందించాలని కోరినప్పటికీ స్పందన రాలేదని, తన హోదాపైనా అభ్యంతరాలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను ఏసీబీ కార్యాలయం స్వీకరించినట్లు ముద్ర కూడా ఉంది.

మరోవైపు ఏసీబీ మాత్రం తమ శాఖలో అవినీతికి తావులేదని, ఆరోపణలు నిరూపితమైతే సొంత శాఖ అధికారులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఇన్స్పెక్టర్ సుధీర్కుమ్పా నిష్పక్షపాతంగా విచారణ జరుగుతోందని తెలిపింది. అయితే, విచారణకు పిలిచిన తేదీలను మాత్రమే ప్రస్తావించడం కాకుండా, అంబేడ్కర్ కోరిన పత్రాలపై ఏం చర్యలు తీసుకున్నారన్నది కూడా వెల్లడించాల్సిన అవసరం ఉంది.

సమాధానం చెప్పాల్సింది ఎవరు?

మూడుసార్లు పిలిచినా రాలేదని చెప్పడం ఒక్కటే విచారణ పారదర్శకతకు నిదర్శనం కాదని అంబేడ్కర్ వాదన ద్వారా స్పష్టమవుతోంది. విచారణకు అవసరమైన పత్రాలు అందించారా? ఫిర్యాదుదారుడి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్నారా? ఆయన సమర్పించిన ఆడియో, వీడియో ఆధారాలపై ఎలాంటి పరిశీలన జరిగింది? అన్న ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది.

అవినీతిపై ఫిర్యాదు చేసిన వ్యక్తికి న్యాయబద్ధమైన అవకాశం కల్పించడం, ఆయన కోరిన సంబంధిత పత్రాలపై నిర్ణయం తీసుకోవడం విచారణలో కీలకం. అంబేడ్కర్ లేవనెత్తిన అంశాలపై ఏసీబీ ఉన్నతాధికారులు స్పష్టత ఇస్తారా? కోరిన పత్రాలు అందించి విచారణను ముందుకు తీసుకెళ్తారా? లేక మూడుసార్లు పిలిచినా రాలేదన్న ప్రకటనతోనే సరిపెడతారా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు