ఫీజు బకాయిలు విడుదల చేయాలి
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్
విద్యార్థులతో కలిసి హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడికి యత్నం
అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్టు
ముషీరాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి): రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజు బకాయిలు(Fee Arrears) ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య(National BC Welfare Association President R Krishnaiah) డిమాండ్ చేశారు. బుధవారం విద్యార్థి సంఘాల నాయకులు(Leaders of student organizations), విద్యార్థులతో కలిసి హైదరాబాద్ కలెక్టరేట్(Hyderabad Collectorate) ముట్టడికి యత్నించారు. పోలీసులు అడ్డుకొని పలువురు నేతలను అరెస్టు చేశారు. అనంతరం ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం రూ.8 వేల కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయాలని, పాత విధానం ప్రకారం ఫీజుల స్కీంను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
90శాతం మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ స్కీంపై ఆధారపడి చదువుతున్నారని పేర్కొన్నారు. కోర్సు పూర్తి చేసి, ఫీజు కట్టే స్థోమత లేని 4లక్షల మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ ఫీజుల స్కీంపై సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అన్ని రాజకీయ పార్టీలతో, మేధావులతో కాంగ్రెస్‌లోని బీసీ, ఎస్సీ మం త్రులు, ఎమ్మెల్యేలతో చర్చించాలని కోరారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం విద్యార్థులు రోడ్లెక్కి ఉద్యమిస్తుంటే ప్రతిపక్షాలు పట్టించుకోవడంలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, బీసీ విద్యార్థి సం ఘం రాష్ట్ర కన్వీనర్ మోడీ రాందేవ్ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ముదిరాజ్, నేతలు సి. రాజేండర్, నిఖిల్ పటేల్, భీంరాజు, శివకుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.