పౌల్ట్రీ పరిశ్రమకు సింగిల్ విండో
- అనుమతులకు ప్రత్యేక పాలసీ
- గ్రామీణ ప్రాంతాలకూ బిల్డ్‌నౌ యాప్
- ఫ్యూచర్ సిటీలో కన్వెన్షన్ సెంటర్‌కు స్థలం
- మొక్కజొన్న, సోయాబీన్ సరఫరాకు సహకారం
- బఫర్ స్టాక్‌పై 48 గంటల్లో నిర్ణయం
- ‘పౌల్ట్రీ ఇండియా ఎక్స్ పో’ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 25(విజయక్రాంతి): పౌల్ట్రీ పరిశ్రమకు(Poultry Industry) అనుమతుల మంజూరులో జాప్యాన్ని నివారించేందుకు సమగ్ర పాలసీతో సింగిల్‌విండో విధానాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రక టించారు. గ్రామీణ ప్రాంతాల్లో పౌల్ట్రీ ఫారాల ఏర్పాటుకు అనుమతులు, భూమి మార్పిడి ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగిస్తామని భరోసా ఇచ్చారు. పట్టణాల్లో బిల్డ్‌నౌ యాప్ ద్వారా అమలవుతున్న సింగిల్‌విండో విధానాన్ని గ్రామీణ ప్రాంతా లకూ విస్తరిస్తామని వెల్లడించారు.
పౌల్ట్రీ పరిశ్రమను ప్రాధాన్య రంగంగా గుర్తించి, దాని సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేసే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో 18వ పౌల్ట్రీ ఇండి యా ఎక్స్పో- సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పౌల్ట్రీ పరిశ్రమ కేవలం కోళ్లు, గుడ్ల ఉత్పత్తికే పరిమితం కాదని, రైతుల ఆర్థికాభివృద్ధికి, వ్యవసాయ కూలీల ఉపాధికి దోహదపడుతుందని అన్నారు. ఈ రంగానికి ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
ఐటీ, ఫార్మా, డిఫెన్స్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లతోపాటు పౌల్ట్రీ పరిశ్రమకూ ప్రాధా న్యం ఇస్తామని చెప్పారు. పౌల్ట్రీ పరిశ్రమకు సంబం ధించి సమావేశాలు, సదస్సులు నిర్వహించుకునేందుకు భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రత్యేక కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన భూమి కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు. డిసెంబ రు 7 నుంచి 9 వరకు నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్- ను ఇందుకు వేదికగా చేసుకోవాలని పరిశ్రమ ప్రతినిధులకు సూచించారు. కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలు సమర్పిస్తే ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
దాణా సరఫరాలో సహకారం..
ఎల్ నినో ప్రభావం, కరువు పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలున్నప్పటికీ రాష్ర్టంలో రెండేళ్లకు సరిపడా సన్నబియ్యం నిల్వలు ఉన్నాయని సీఎం తెలిపారు. అయితే పౌల్ట్రీ పరిశ్రమకు అవసరమైన మొక్కజొన్న కొరత ఉందనే విషయం ఇటీవల తన దృష్టికి వచ్చిందన్నారు. పరిశ్రమ సంక్షోభంలో ఉన్నప్పుడు మొక్కజొన్న, సోయాబీన్ వంటి దాణా ముడిసరుకుల సరఫరాలో ప్రభుత్వం సహకరిస్తుందని భరోసా ఇచ్చారు. బహిరంగ మార్కెట్లో విక్రయించడానికి బదులుగా అందుబాటులో ఉన్న నిల్వల్లో అవసరమైన మేరకు పౌల్ట్రీ పరిశ్రమకు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.
ప్రభుత్వం వద్ద ఉన్న బఫర్ స్టాక్ ఎంత? పౌల్ట్రీ పరిశ్రమకు ఏ మేరకు సరఫరా చేయవచ్చు? ఏ ధరకు అందించవచ్చు? అనే అంశాలపై వ్యవసాయ శాఖ మంత్రితో కలిసి సమీక్షించాలని మంత్రి వాకిటి శ్రీహరికి సూచిం చారు. 48 గంటల్లోగా సమస్యకు పరిష్కారం చూపేలా నిర్ణయం తీసుకోవాలన్నారు. పౌల్ట్రీ పరిశ్రమతో రైతులకు అదనపు ఆదా యం సమకూరుతుందని సీఎం అన్నారు. రైతులు పండించే మొక్కజొన్న, సోయాబీన్‌తోపాటు నూకలు, తౌడు వంటి ఉప ఉత్పత్తులను కూడా పరిశ్రమ కొనుగోలు చేస్తోందని గుర్తుచేశారు.
గుడ్లు, చికెన్ ఉత్పత్తి ద్వారా రైతుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడంతోపాటు యువతకు ప్రొటీన్లతో కూడిన పౌష్టికాహారాన్ని అందించడం లో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. తెలంగాణలో ప్రతి రోజూ 5.30 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయని సీఎం వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వారానికి మూడు గుడ్లు, చికెన్‌తో కూడిన భోజనం అందించడంలో పౌల్ట్రీ పరిశ్రమ సహకారం కీలకమన్నారు.