సామరస్యమే అతిపెద్ద పెట్టుబడి బలం

26-11-2026 | 05:50am

గంగాజమున తహజీబ్‌తో హైదరాబాద్‌కు గుర్తింపు

డెక్కన్ ఐకాన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 

హైదరాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): కులం, మతం, ప్రాంతం, జాతీయతకు అతీతంగా అందరినీ అక్కున చేర్చుకునే హైదరాబాద్(Hyderabad) విశిష్ట సంస్కృతే నగరానికి అతిపెద్ద ఆర్థిక బలమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(Uttam Kumar Reddy) అన్నారు. జీ సలామ్, జీ నెట్వర్క్(Zee Salaam, Zee Network) సంయుక్తంగా బుధవారం నిర్వహించిన డెక్కన్ ఐకాన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో(Deccan Icons Awards Ceremony) ఆయన మాట్లాడారు. హైదరాబాద్ గంగాజమున తహజీబ్‌కు సజీవ ప్రతిరూపమన్నారు.

మైనారిటీలకు కేవలం ఆర్థిక సహాయం అందించడమే కాకుండా వారిని పారిశ్రామికవేత్తలు(Industrialists), నిపుణులు, ఉన్నతాధికారులు, నాయకులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరంలో మైనారిటీ సంక్షేమానికి సుమారు రూ.3,585 కోట్లు కేటాయించిందని వెల్లడించారు.

విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక స్వావలంబనకు అనుగుణంగా ఈ కేటాయింపులను మరింత పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అర్హులైన ముస్లిం సామాజికవర్గాలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించడం గత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చారిత్రక నిర్ణయమని మంత్రి గుర్తుచేశారు. ఇందిరమ్మ మైనారిటీ మహిళా పథకం కింద అర్హులైన వితంతువులు, విడాకులు పొందిన మహిళలు, అనాథలు, అవివాహిత మహిళలకు స్వయం ఉపాధి కోసం ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు