కృష్ణా జలాల పంపిణీపై కుదరని ఏకాభిప్రాయం

26-11-2026 | 05:05am

కృష్ణా డెల్టా సిస్టమ్‌కు నీటి విడుదలపై తెలంగాణ అభ్యంతరం

బోర్డు సమావేశంలోనే తేల్చుకోవాలని నిర్ణయం

హైదరాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి) : నాగార్జునసాగర్ ప్రాజెక్టులో(Nagarjunasagar Project) అందుబాటులో ఉన్న నీటి పం పిణీపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. కృష్ణా డెల్టా సిస్టమ్(Krishna Delta System) (కేడీఎస్)కు నీటిని కేటాయించే అంశంపై రెండు రాష్ట్రాలు భిన్న వైఖరులు తీసుకోవడంతో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(Krishna River Management Board) (కేఆర్‌ఎంబీ) త్రిసభ్య కమిటీ సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. ఈ నెల 23న జరిగిన సమావేశానికి సంబంధించిన మినిట్స్‌ను బోర్డు(Minutes to the Board) బుధవారం విడుదల చేసింది.

అందుబా టులో ఉన్న నీటిని ఏ ప్రాతిపదికన, ఏ కాలువకు ఎంత కేటాయించాలనే అంశంపై రెండు రాష్ట్రాల ఈఎన్సీలు తమ ప్రతిపాదనలను సమర్పించినప్పటికీ, వాటిపై ఏకాభిప్రాయం రాలేదు. దీంతో ఈ అంశాన్ని త్వరగా బోర్డు సమావేశంలో చర్చించాలని కమిటీ సభ్యులు సూచించారు. కేఆర్‌ఎంబీ గణాంకాల ప్రకారం నవంబర్ 23 నాటికి నాగార్జునసాగర్‌లో 510 అడుగుల కనీస డ్రాడౌన్ స్థాయి (ఎండీ డీఎల్) వద్ద 45.40 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది.

ఇందులో 10 శాతం అంటే 4.54 టీఎంసీలను ఆవిరి నష్టాల కింద పరిగణిస్తే, వాస్తవంగా వినియోగించుకోగల నీటి పరిమాణం 40.86 టీఎంసీలుగా కమిటీ లెక్కించింది. మరోవైపు ప్రాజెక్టుకు ఎలాంటి కొత్త ఇన్‌ఫోలు లేవని సమావేశంలో వెల్లడించారు. కాగా సమావేశంలో ఏపీ, తెలంగాణ ఇంజినీర్-ఇన్-చీఫ్లు నీటి కేటాయింపులపై వేర్వేరు ప్రతిపాదనలు చేశారు. ఏపీ ప్రతిపాదన ప్రకా రం.. కుడి కాలువ ద్వారా ఏపీ వాటా కింద 8 టీఎంసీలు, ఎడమ కాలువ ద్వారా తెలంగాణ వాటా కింద 7 టీఎంసీలు, కృష్ణా డెల్టా సిస్టమ్‌కు 6 టీఎంసీలు కేటాయించాలని సూచించింది.

తెలంగాణ ప్రతిపాదన ప్రకా రం.. కుడి కాలువ ద్వారా ఏపీకి 4.5 టీఎంసీలు, ఎడమ కాలువ ద్వారా తెలంగాణకు 10.50 టీఎంసీలు కేటాయించాలని పేర్కొంది. కృష్ణా డెల్టా సిస్టమ్‌కు ఎలాంటి నీటి కేటాయింపులు చేయకూడదని స్పష్టం చేసింది. కేడీఎస్‌కు నీటి కేటాయింపుల విషయంలోనే ప్రధానంగా విభేదాలు తలె త్తడంతో అందుబాటులో ఉన్న నీటిని పంచుకునే అంశం ముందుకు సాగలేదు. కేఆర్‌ఎంబీ వద్ద అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఇప్పటివరకు ఏపీ 17.207 టీఎంసీల నీటిని వినియోగించుకోగా, తెలంగాణ 47.177 టీఎంసీలను వినియోగించుకుంది.

ప్రస్తుతం ప్రాజెక్టులో 45.396 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు మినిట్స్‌లో పేర్కొన్నారు. గత వినియోగం, ప్రస్తుత నిల్వలు, రానున్న మూడు నెలల అవసరాలను పరిగణనలోకి తీసుకుని నీటి పంపిణీపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. చివరకు రెండు రాష్ట్రాల ప్రతినిధుల మధ్య చర్చలు జరిగినప్పటికీ కృష్ణా డెల్టా సిస్టమ్ అంశంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో, వీలై నంత త్వరగా కేఆర్‌ఎంబీ పూర్తిస్థాయి బోర్డు సమావేశాన్ని నిర్వహించి సమస్యను చర్చించాలని త్రిసభ్య కమిటీ సూచించింది. దీంతో నాగార్జునసాగర్ నీటి పంపిణీ వ్యవహారం తదుపరి బోర్డు సమావేశానికి చేరింది.

మరిన్ని వార్తలు