గుర్రపు పందాలు.. 4 లక్షల మందికి విందు

26-11-2026 | 05:20am

బీహార్‌లో కూతురి పెళ్లికి ఎమ్మెల్యే హంగామా

10 కి.మీ. మేర ట్రాఫిక్ జామ్

లక్నో, నవంబర్ 25: గుర్రపు పందాలు(Horse racing).. 4 లక్షల మందికి విందు.. 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్.. బీహార్ రాజకీయాల్లో ‘ఛోటే సర్కార్’, ‘దాదా’గా పేరున్న మెకామా ఎమ్మెల్యే అనంత్ సింగ్ తన కుమార్తె శివాంగి పెళ్లికి నానా హంగామా చేశారు. తన పూర్వీకుల గ్రామమైన నద్వాన్‌లో నిర్వహించిన ఈ పెళ్లికి ప్రజలందరికి బహిరంగ ఆహ్వానం పలికారు. బీహార్‌తో పాటు జార్ఖండ్ నుంచి లక్షలాది మంది తరలి రావడంతో గ్రామం జనసంద్రమైంది. 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. వివాహానికి వచ్చిన బీహార్ అసెంబ్లీ స్పీకర్ ప్రేమ్ కుమార్ కాన్వాయ్ కూడా ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుంది.

పెళ్లి సందర్భంగా ప్రధాన ఆకర్షణగా నిర్వహించిన గుర్రపు పందాలను తిలకించేందుకు జనం చెట్లపైకి, విద్యుత్ టవర్లపైకి ఎక్కారు. విజేతకు మహీంద్రా థార్ కారును బహుమతిగా ప్రకటించడంతో ప్రజల్లో మరింత ఆసక్తి పెరిగింది. భద్రతా కారణాలతో ఫైనల్ పోటీని ఈ నెల 26వ తేదీకి వాయిదా వేశారు. ఈ పెళ్లిలో నాలుగు లక్షల మందికి పైగా భోజనం చేశారు. 500 మంది వంటవాళ్లతో 300 వంట కేంద్రాలను ఏర్పాటు చేశారు. వివాహ వేదికను జైపూర్ రాజభవనాన్ని తలపించేలా తీర్చి దిద్దారు. న్యూజిలాండ్, చైనా, థాయ్‌లాండ్ నుంచి పూలను తెప్పించి అలంకరించారు. 

మరిన్ని వార్తలు