162 వ రోజు ఎస్ పి ఎం కార్మికుల దీక్షలు
28-10-2026 | 04:23pm
కాగజ్ నగర్ , అక్టోబర్ 28 ( విజయక్రాంతి) :కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికులు(Paper mill workers) చేస్తున్న రిలే దీక్షలు బుధవారం నాటికి 162 వ రోజుకు చేరినాయి. పేపర్ మిల్లులో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
ఈనాటి దీక్షలో జేఏసీ కన్వీందర్ గో గర్ల రాములు, కో కన్వీనర్ షబ్బీర్, సిపిఎం నాయకులు ముంజం ఆనంద్ కుమార్, సురేందర్ యాదవ్, మొగిలి వెంకటేష్ , రాజేష్ యాదవ్, రాజు, ముత్తు విజయకుమార్ లు దీక్షలో పాల్గొన్నారు.