భర్త వద్దంటే.. చావేనా?
కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. లక్ష్మీప్రియాంక (27) అనే వివాహిత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య (Suicide) చేసుకుంది. ఏడాదిన్నర క్రితం వివాహం జరిగిన ఆమె.. భర్త వేధింపుల (Harassment) కారణంగా గత ఏప్రిల్ నుంచి పుట్టింట్లోనే ఉంటోంది. ఇటీవల భర్త కోర్టు నోటీసు (Court Notice) పంపడంతో గొల్లపూడిలోని భర్త ఇంటికి వెళ్లి తిరిగి వచ్చింది. తల్లిదండ్రులు విజయవాడకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడింది.
తన ఆత్మహత్యకు భర్త, అత్త, ఆడపడుచులే కారణమంటూ సూసైడ్ నోట్ (Suicide Note) రాసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు (Case Registered) చేసి దర్యాప్తు (Investigation) చేపట్టారు.