ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల బీమా భరోసా
- జిల్లా అదనపు కలెక్టర్. పి.చంద్రయ్య..
జన్నారం,( విజయక్రాంతి ): మంచిర్యాల జిల్లా(Mancherial District) జన్నారం మండలం చింతలపల్లి గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం(Indiramma Family Life Insurance Scheme) శిబిరాన్ని మండల ప్రత్యేక అధికారి జి.శ్రీనివాస్ రెడ్డి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి లతో కలిసి సందర్శించి, పథకం అమలు తీరును పరిశీలించారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలను(Primary school) సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న సదుపాయాలు, ఆహార నాణ్యత, విద్యా బోధన తీరును పరిశీలించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోవాలని, అంగన్వాడీ కేంద్రాలు(Anganwadi Centres), ప్రభుత్వ పాఠశాలలలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ మెరుగైన సేవలు అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, లక్షెట్టిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు, నెల్కి వెంకటాపూర్ పిఏసిఎస్ చైర్మన్ ముత్యాల శ్రీనివాస్, క్షేత్ర సహాయకులు, ఆయా గ్రామాల సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు