నేరస్తులకు శిక్షలే లక్ష్యంగా పోలీసుల దర్యాప్తు
కరీంనగర్ సీపీ గౌష్ ఆలం.
కరీంనగర్ క్రైం, నవంబర్ 20, (విజయక్రాంతి): నేరాలకు పాల్పడే వారికి చట్టప్రకారం కఠిన శిక్షలు(Severe punishments) పడేలా చేయడమే లక్ష్యంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్(Karimnagar Police Commissionerate) పరిధిలోని అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారనీ సిపి గౌస్ ఆలం తెలిపారు. పక్కా ఆధారాలు, శాస్త్రీయ దర్యాప్తు (ఫోరెన్సిక్(Forensic), సాంకేతిక ఆధారాలు(Technical evidence)) కోర్టులో సమర్థవంతమైన వాదనల ఫలితంగా 2026 సంవత్సరంలో మొత్తం 29 కీలక కేసుల్లో నిందితులకు న్యాయస్థానాలు జైలు శిక్షలు, జరిమానాలు విధించినట్లు పేర్కొన్నారు.
నేర నియంత్రణతో పాటు నేరస్తులకు సత్వరమే శిక్షలు పడేలా పటిష్టమైన దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు, కోర్టు డ్యూటీ ఆఫీసర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కరీంనగర్ పోలీసు కమీషనర్ గౌష్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు.