ఆదివాసీల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు
నిబంధనల మేరకు దశలవారీగా సమస్యల పరిష్కారం
ఐటీడీఏ పీఏ మకరందు..
జన్నారం, ( విజయక్రాంతి ): మంచిర్యాల జిల్లా(Mancherial District) జన్నారం మండలంలోని కవ్వాల్ లోని కొత్తపేట గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆదివాసీల సమస్యలను(Adivasi Issues) గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకుంటామని ఉట్నూర్ ఐటీడీఏ పీఏ మకరందు తెలిపారు. శుక్రవారం కొత్తపేట గ్రామపంచాయతీ(Kottapeta Gram Panchayat) పరిధిలోని కొలాంగూడ, రాయికుంట గ్రామాల్లో ఆదివాసీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ప్రత్యేకంగా చర్చించారు. రెండు కల్యాణ మండపాల నిర్మాణానికి అవసరమైన అంచనాలు రూపొందించి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. ఆదివాసీ గ్రామాల్లో రేషన్ బియ్యం(Ration rice) పంపిణీకి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌కు సూచించారు.
అంతేకాకుండా సర్పంచ్ దినేష్ పవార్ ఆధ్వర్యంలో ఆదివాసీలు పీఏ మకరందును కలిసి తమ సమస్యలను వివరించారు. గ్రామాల అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి సమస్యలను దశలవారీగా పరిష్కరించాలని సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు...