ప్రతిఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు
ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి 2200 మందికి పింఛను మంజూరు పత్రాల పంపిణీ
దామరచర్ల :నవంబర్ 18: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు(Government welfare schemes) అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.
మిర్యాలగూడ పట్టణంలోని మినీ రవీంద్ర భారతిలో బుధవారం మిర్యాలగూడ, దామరచర్ల , అడవిదేవులపల్లి మండలాలకు చెందిన 2,200 మంది లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు.
వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఇతర అర్హులైన వారికి చేయూత పింఛన్లు ఆర్థిక భరోసా కల్పిస్తూ వారి జీవనానికి అండగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం పేదలు, బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ లు, కార్యదర్శి లు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు