శుభం గార్డెన్స్‌లో మెగా రక్తదాన శిబిరం
మనోహరబాద్, అక్టోబర్ 28, (విజయక్రాంతి): మనోహరబాద్ మండల(Manoharabad Mandal) కేంద్రం శుభం గార్డెన్స్ లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ(Police Commemoration Day) సందర్భంగా రక్త దాన శిబిర కార్యక్రమాన్ని మనోహరబాద్ పోలీసులు ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అడిషనల్ ఎస్పీ విక్రాంత్ సింగ్ హాజరైయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్తాన్ని దానం చేయాలి, తద్వారా మన ఆరోగ్యం మెరుగు పడడమే కాకుండా పేదప్రజల అవసరం కొరకు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగ పడుతుందని కితాబిచ్చారు.
రక్తదానం వలన ఒక ప్రాణాన్ని నిలబెట్టిన వారుగా ఉంటారని అన్నారు. దానం చేసిన ఈ రక్తం తలసేమియా వ్యాధిగ్రస్తులకు పంపడం జరుగుతుందని తెలిపారు. ఇందులో డీఎస్పీ నరేందర్ గౌడ్, సిఐ వెంకట రాజా గౌడ్, ఎస్ఐ లు కరుణాకర్ రెడ్డి, సుభాష్ గౌడ్, గంగరాజు, మధుకర్, నరేష్, పోలీస్ సిబ్బంది గ్రామాల సర్పంచలు, నాయకులు పాల్గొన్నారు.