మాకెప్పుడిస్తరు సార్!?
పట్టా పాస్‌పుస్తకాల కోసం రైతుల నిరీక్షణ
మహబూబాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): అంగట్లో అన్నీ ఉన్న అల్లుని నోట్లో శని అన్న చందంగా.. మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం మండలం నారాయణపురం గ్రామ(Narayanapuram village) రైతుల్లో 780 మందికి ఏళ్ల తరబడిగా1,468.15 ఎకరాల్లో సాగు చేసుకుంటు న్న వ్యవసాయ భూములకు(Agricultural lands) పట్టా పాస్ పు స్తకాలు లభించగా, అదే గ్రామంలో 117 సర్వేనెంబర్ లో 146 ఎకరాల భూమిని సా గు చేసుకుంటున్న మరో 126 మంది రైతులకు పట్టా పాస్ పుస్తకాల జారీ(Issuance of Pattadar Passbooks) ప్రక్రియ ని లిచిపోయింది.
గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో నెల్లికుదురు మండలం చిన్న ముప్పారం గ్రామ శివారు గ్రామంగా కొనసాగిన నారాయణపురం గ్రామాన్ని కేసముద్రం మం డలంలో విలీనం చేస్తూ రెవెన్యూ గ్రామంగా ప్రకటించారు. ఆ తర్వాత 2017 లో జరిగిన భూ ప్రక్షాళన కార్యక్రమం లో గ్రామంలో వందల ఎకరాల్లో సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూములను ‘అటవీ’ భూమిగా నమోదు చేయడంతో అప్పటివరకు ఉన్న పట్టా పాస్ పుస్తకాలు, రెవిన్యూ రికార్డుల్లో పూర్తిగా రైతుల పేర్లు తొలగిపోయి దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు రైతులు తమ భూములపై హక్కులు కోల్పోయారు.
ఈ సమస్యను పరిష్కరించాలంటూ గ్రామానికి చెందిన రైతులు, ప్రజలు అనేక పర్యాయాలు ఆందోళన బాట పట్టారు. చివరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రా ష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivasa Reddy) దృష్టికి ఈ సమస్యను ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు ప్రత్యేకంగా తీసుకువెళ్లారు. దీనితో స్పందించిన ఆయన నారా యణపురం గ్రామాన్ని ప్రత్యేకంగా రీ సర్వే చేయించారు. అటవీశాఖ రెవెన్యూ శాఖ సం యుక్త ఆధ్వర్యంలో సర్వే చేయించి అటవీ శా ఖ నుంచి నో అబ్జెక్షన్ జారీ చేశారు.
ఆ తరా ్వత భూభారతి ద్వారా గ్రామ సరిహద్దులు నిర్ణయించి ప్రతి భూమిని క్షేత్రస్థాయిలో సర్వే చేసి, సాగు చేసుకుంటున్న రైతులకు పట్టా పాస్ పుస్తకాలు జారీ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు గత ఆగస్టు 31న మంత్రి చేతుల మీదుగా 780 మంది రైతులకు 1,468.15 ఎకరాల భూమిని హక్కుదారులుగా ప్రకటిస్తూ ల్యాండ్ పొజిషన్ మార్క్ ( ఎల్ పీ ఎం) సహా పట్టా పాస్ పుస్తకాలు అందజేశారు. అయితే ఇదే గ్రామంలో 117 సర్వేనెంబర్ లో సుమారు 146 ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్న 126 మంది రైతులకు మాత్రం సర్వే నిర్వహించి పట్టా పాస్ పుస్తకాలు జారీ చేయకుండా నిలిపివేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
780 మందికి పట్టా పాస్ పుస్తకాలు జారీచేసిన ప్రభుత్వం తమను మాత్రం గాలికి వదిలేసిందని ఆరోపిస్తున్నారు. తాత ముత్తాతల కాలం నుండి తాము ఆ భూమిని సాగు చేసుకుంటున్నామని, వంశపారంపర్యంగా తమకు హక్కుగా వస్తున్న భూమిని, చిన్న ముప్పారం గ్రామ పరిధిలో ఉన్నప్పుడు పట్టా పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయని, 1బీ, రికార్డులు ఉన్నాయని, అప్పట్లో బ్యాంకు రుణాలు కూడా తీసుకున్నామని రైతులు చెబుతున్నారు.
117 సర్వేనెంబర్ భూమిని కూడా ఇటీవల ఎంజాయ్మెంట్ సర్వే చేశార ని, అందరికీ పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చి త మకు మాత్రం ఇవ్వడం లేదని చెబుతున్నా రు. మేమేం పాపం చేశాం సార్.. ఏండ్ల తరబడిగా సాగులో ఉన్నామని, తమ దగ్గర అ ప్పటి రెవిన్యూ రికార్డును కూడా ఉన్నాయని, తమకు కూడా పట్టా పాస్ పుస్తకాలు జారీ చేయాలంటూ రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
22 ఏ లో చేర్చడం వల్లే సమస్య?
117 సర్వేనెంబర్ ను ప్రభుత్వం 22ఏలో చేర్చడం వల్లే రైతులకు పట్టా పాస్ పుస్తకాలు జారీ చేయడానికి ఆటంకంగా మారిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ భూమిని రైతులు ఏండ్ల తరబడి సాగు చేసుకుంటున్నాప్పటికీ, ప్రస్తుతం ప్రభుత్వ నిబ ంధనల ప్రకారం ‘రీ అసైన్డ్’ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. దీనివల్ల ఆ సర్వే నంబర్ లో సాగు చేసుకుంటున్న రైతులందరికీ కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు జారీ చేయాలంటే ప్రభుత్వం ప్రత్యేకంగా అసైన్మెం ట్ కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవా ల్సి ఉంటుంది. దీనివల్ల రైతులకు పట్టా పాస్ పుస్తకాల జారీకి ఆటంకంగా మారిందని చె బుతున్నారు. పట్టా పాస్ పుస్తకాల కోసం నారాయణపురం గ్రామానికి చెందిన మరి కొంతమంది రైతులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రభుత్వానికి నివేదించాం
నారాయణపురంలో మిగిలిపోయిన రైతులకు పట్టా పాస్ పుస్తకాలు జారీ చేయడానికి ప్రభుత్వానికి నివేదించాం. 117 సర్వేనెంబర్ భూమి అంశం అటవీశాఖ, రెవెన్యూ శాఖ పరిధిలో ఉండడంవల్ల ప్రభుత్వ భూమిగా నమోదయ్యింది. ఈ విషయంపై సాగులో ఉన్న రైతులకు పట్టా పాస్ పుస్తకాల జారీ అంశాన్ని ప్రత్యేకంగా పరిగణించడం వల్ల, పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వడానికి అడ్డుగా మారింది. ఈ సమస్య ప్రభుత్వం దృష్టిలో ఉన్నందున ప్రభుత్వ నిర్ణయం మేరకు త్వరలో ఈ అంశాన్ని కూడా పరిష్కరిస్తాం.
జీ.వివేక్, తహసీల్దార్, కేసముద్రం
అన్ని హక్కులు ఉన్నాయి..
మా ముత్తాత కాలం నుండి 117 సర్వేనెంబర్ లో ఉన్న భూమిని సా గు చేస్తున్నాం. అప్పటినుండి భూప్రక్షాళన స మయం వరకు మాకు సంబంధించిన అన్ని హ క్కులు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రా ష్ట్రంలో జారీచేసిన పట్టా పాస్ పుస్తకం, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 1బీ, పహాని రికార్డులు కూడా ఉన్నాయి. కేసముద్రం ఆంధ్ర బ్యాంకు నుండి అప్పట్లో రుణం కూ డా తీసుకున్నాము. ధరణితో తమ భూమి రి కార్డులు లేకుండా చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మా ఊరిలో అందరికీ పట్టాలు ఇచ్చి, మాకు మాత్రం ఇవ్వడం లేదు. సర్వే రికార్డు ఆధారంగా మాకు కూడా వెంటనే పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలి.
బొల్లం వెంకన్న, రైతు, నారాయణపురం