కొనసాగుతున్న అన్నదానం
22-11-2026 | 10:11pm
కోదాడ (అనంతగిరి) నవంబర్ 22(విజయక్రాంతి) : అనంతగిరిలోని(Ananthagiri) అయ్యప్ప సన్నిధిలో ప్రారంభం అయిన అన్నప్రసాద వితరణ 46,వ రోజు ఆదివారం సుమారుగా 340 మందికీ పైగా స్వాములు అన్నప్రసాదం స్వీకరించినారు. దాతలుగా మహారాజపోశకులతొ పాటుగా ఖానాపురం వాస్తవ్యులు శ్రీ కనగాల నరసింహారావు- రాధమ్మ దంపతులు , వారి కుటుంబ సభ్యులు వ్యవహారించినారు.కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పందిరి వీరయ్య, గింజుపల్లి సురేష్ దంపతులు, గింజుపల్లి రమేష్ కనగాల వీరయ్య,ఐతనబోయిన వెంకటేశ్వర్లు, ఈదుల యాదగిరి,దండు రమేష్,అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.