నిండు జీవితానికి రెండు చుక్కలు

22-11-2026 | 09:49pm

- ఎల్బీనగర్ నియోజకవర్గంలో పల్స్ పోలియో 

ఎల్బీనగర్, నవంబర్ 22: ఎల్బీనగర్ నియోజకవర్గంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. వైద్యారోగ్యశాఖ సిబ్బంది పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సరూర్ నగర్ వనస్థలిపురం, హయత్ నగర్, మన్సూరాబాద్ లోని ప్రభుత్వ దవాఖానలు, ఆయా డివిజన్లలోని బస్తీ దవాఖానల్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి(MLA Sudheer Reddy), మాజీ కార్పొరేటర్లు, వివిధ పార్టీల నాయకులు ఐదేండ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. హయత్ నగర్ ప్రైమరీ స్కూల్ అనుమగల్ బస్తీలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు చెన్నగోని శ్రీధర్ గౌడ్, స్కైలాబ్ తదితరులతో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, పోలియో రహిత సమాజ నిర్మాణం కృషి చేయాలని ఆకాంక్షించారు.

పోలియో మహమ్మారిని పూర్తిగా నిర్మూలించేందుకు సామాజిక బాధ్యతగా ఐదేండ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. లింగోజిగూడ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కందికంటి శ్రీధర్ గౌడ్, బీఆర్ఎస్ నాయకుడు తిలక్ రావు, చింతల్‌కుంట డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోచబోయిన సురేశ్ యాదవ్, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు గణమనెను ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సాహెబ్ నగర్ ప్రభుత్వ పాఠశాల, సాహెబ్ నగర్ బస్తీ హాస్పిటల్, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, డీపీఎస్ స్కూల్ లో చిన్నారులకు  మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి పోలియో చుక్కలు వేశారు.  డాక్టర్స్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు నల్లెంకి ధన్ రాజ్ గౌడ్, ఆర్కేపురం డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు పున్న గణేశ్ నేత చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

మరిన్ని వార్తలు