1/70 చట్టం పటిష్ట అమలు చేయాలి
ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో గ్రామస్థాయి అవగాహన ప్రచారం.
ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ ( జేఏసీ).
వెంకటాపురం, నూగూరు, నవంబర్ 22, విజయక్రాంతి : ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసుల భూమి హక్కుల పరిరక్షణ కోసం 1/70 భూ బదిలీ నియంత్రణ చట్టాన్ని(Land Transfer Control Act) సమర్థవంతంగా అమలు చేయాలనే లక్ష్యంతో ఆదివాసి సంఘాల(Tribal organizations) ఆధ్వర్యంలో గ్రామగ్రామాన అవగాహన ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
ఈ ప్రచారంలో భాగంగా ప్రతి ఆదివాసి గ్రామంలో ప్రజలకు 1/70 చట్టం ప్రాధాన్యత, భూముల రక్షణ, అక్రమ భూ బదిలీలపై(Illegal Land Transfer) చట్టపరమైన చర్యలు, పీసా చట్టం ద్వారా గ్రామసభలకు ఉన్న అధికారాలపై అవగాహన కల్పించడం జరిగింది.ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసుల భూములు, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామస్థాయిలో ఆదివాసి యువత, మహిళలు, పెద్దలు ఐక్యంగా ముందుకు వచ్చి తమ హక్కుల పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు.మా ప్రధాన డిమాండ్లు ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి.
ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించి భూముల రీ-సర్వే చేపట్టాలి.
పీసా చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి.అక్రమ భూ బదిలీలపై చట్ట ప్రకారం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి.ఆదివాసులరాజ్యాంగబద్ధమైన హక్కులను పరిరక్షించాలి.ఏజెన్సీ ప్రాంతాల చట్టాలు పరిరక్షించుటకై ఆదివాసులు అంతా ఏకమై నవంబర్ 30న వెంకటాపురం తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించాలని ఆదివాసి సమాజానికి పిలుపునియ్యడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆదివాసి నవనిర్మాణ సేనరాష్ట్రఅధ్యక్షులుకోర్సనరసింహమూర్తి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసం నాగరాజు, గోండ్ వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనెం సాయి, ములుగు జిల్లా అధ్యక్షులు పూనేం ప్రతాప్, ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా కన్వీనర్ పర్షిక సతీష్, మండల అధ్యక్షులు తుర్స కృష్ణ బాబు,తుడుం దెబ్బ మండల అధ్యక్షులు కంతి వెంకటకృష్ణ ,ఆదివాసి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.