వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ. 4 కోట్ల నిధులు మంజూరు

22-11-2026 | 10:15pm

రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్ నవంబర్ 22: నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) కొల్లాపూర్ మండలం రామాపురం గ్రామంలోని గుట్టపై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ(Sri Venkateswara Swamy Temple) అభివృద్ధి కోసం నాలుగు కోట్ల నిధులు మంజూరు. చేస్తున్నట్టు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) ఆదివారం ఒక ప్రకటనతో తెలియజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. నిధులు మంజూరు తో ఆలయ అభివృద్ధితో పాటు బ్రిడ్జి కయ్ రోడ్డు నిర్మాణం ద్వారా గ్రామ ప్రజలకు భక్తులకు(devotees) రాకపోకలు సౌకర్యం మరింత మెరుగు పడుతుందని మంత్రి తెలిపారు. రామాపురం గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందించిన గౌరవ మంత్రి జూపల్లి కృష్ణారావు కి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బచ్చలకూర బాల్రాజ్. కాంగ్రెస్ పార్టీ నాయకులు కలమూరి మధు గ్రామస్తులు మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు