అయ్యప్ప ఆలయంలో శివలింగ ప్రతిష్టాపన

21-11-2026 | 06:39pm

కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలోని శ్రీ ధర్మశాస్త అయ్యప్ప ఆలయంలో శనివారం యోగేశ్వర శివలింగ, త్రిశూల ప్రతిష్టాపన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయంలో నాగదోష నివారణ (Naga Dosha Nivaran) కోసం ఆలయ తాంత్రి సూచన మేరకు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి (Varanasi) నుంచి ప్రత్యేకంగా శివలింగాన్ని తీసుకువచ్చారు.

వేదమంత్రోచ్ఛారణలు, ప్రత్యేక పూజల నడుమ శివలింగం, త్రిశూలాన్ని ప్రతిష్టించారు. అనంతరం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రతిష్టాపన కార్యక్రమంతో ఆలయానికి నాగదోషం తొలగిపోయినట్లు తాంత్రి (Temple Tantri) తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలాధారులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు (Devotees) పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

మరిన్ని వార్తలు