రైల్వే ఇంజినీరింగ్ బృందం రికార్డు

02-11-2026 | 05:30am

నెక్కొండ మడుగు మధ్య 45 కి.మీ.ల ట్రాక్ స్లీపర్ల పునరుద్ధరణ విజయవంతం!

మహబూబాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): దక్షిణ మధ్య రైల్వే, సికింద్రాబాద్ డివిజన్ ఇంజనీరింగ్(Secunderabad Division Engineering) విభాగం ట్రాక్ ఆధునీకరణ పనుల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి సరికొత్త రికార్డును నమోదు చేసింది.

ప్రయాణికుల భద్రత, రైళ్ల వేగం పెంపు, సమయ పాలనను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో కాజీపేట మోటు మర్రి సెక్షన్‌లో చేపట్టిన భారీ స్లీపర్ల పునరుద్ధరణ (టీఎస్‌ఆర్) పను లు విజయవంతంగా ముగిశాయి.

అత్యాధునిక ట్రాక్ రిలేయింగ్ ట్రైన్ (టీఆర్ టీ) మెషీ న్ ద్వారా కేసముద్రం, గుండ్రాతి మడుగు రైల్వే స్టేషన్ల మధ్య అక్టోబర్ నెలలో ఏకంగా 15.04 టీకేఎం మేర స్లీపర్ల పునరుద్ధరణ పనులు పూర్తి చేసి డివిజన్ చరిత్రలోనే సరికొత్త రికార్డు నెలకొల్పారు. సెప్టెంబర్ నెలలో సాధించిన 13.805 రికార్డును అధిగమించి, అక్టోబరులో 8.9 శాతం అదనపు వృద్ధిని సాధించడం విశేషం.

గత జూలై 12.121 టీ కే ఎం, ఆగస్టు 13.565 టీ కే ఎం, సెప్టెంబర్ నెలల పురోగతిని మించి నిరంతర ప్రతిభతో ఈ మైలురాయిని చేరుకున్నారు. నెక్కొండ నుంచి గుండ్రాతి మడుగు వరకు ఉన్న మొ త్తం డౌన్ లైన్‌లోని 45 టీకేఎం మేర రైలు మార్గాన్ని కేవలం 3.5 నెలల స్వల్ప వ్యవధిలోనే సరికొత్త (పీఎస్సీ) కాంక్రీట్ స్లీపర్లతో విజయవంతంగా మార్చారు.

ఈ భారీ ఆధునీకరణ పనులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ, సి కింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్ గోపాలకృష్ణన్, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్ ఆంజనేయులు రెడ్డి స్వయంగా పలుమార్లు క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల పురోగతిని, నాణ్యతా ప్రమాణాలను నిశితంగా పర్యవేక్షించారు.

ఈ సంక్లిష్టమైన పనులను సీనియ ర్ డీ ఈ ఎన్ యాదగిరి శశాంక, ఏ డీ ఈ ఎన్ తుగ్గుట్లు ఆంజనేయులు రెడ్డి, ఎస్ ఎస్ ఈ పీ వే ఫౌజన్ అలం సమర్థవంతమైన నా యకత్వం, ప్రత్యక్ష పర్యవేక్షణలో అత్యంత పకడ్బందీగా, విజయవంతంగా పూర్తి చేశారు.

మహబూబాబాద్ సెక్షన్ పరిధిలోని ఇం జనీరింగ్ ట్రాక్ మెయింటెయినర్లు, గ్యాంగ్మె న్లు, కార్మికులు ఎండనక, వాననక శక్తివంచన లేకుండా అహర్నిశలు శ్రమించి లక్ష్యాన్ని నిర్ణీత సమయానికి చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. పాతబడిన స్లీపర్ల స్థానంలో పటిష్టమైన కొత్త స్లీపర్లు అమర్చడం వల్ల ట్రాక్ స్థిరత్వం, రేఖాగణిత నాణ్యత మెరుగై రైళ్ల రన్నింగ్ క్వాలిటీ గణనీయంగా పెరుగుతుంది.

మరిన్ని వార్తలు