నిత్య నరకం.. న్యాల్కల్ రహదారి!
- అడుగడుగునా గుంతలే..
- రెండేళ్లయినా పూర్తికాని జాతీయ రహదారి
- చోద్యం చూస్తున్న పాలకులు, అధికారులు
జహీరాబాద్, నవంబరు 1 : జహీరాబాద్ ప్రాంతంలోని రోడ్లపై(Zahirabad Roads) ప్రయాణీకులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. వాహనదారుల కష్టాలపై సంబంధిత శాఖ అధికారులు(Branch Officials) తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. గతంలో రోడ్లపై గుంతలు ఏర్పడితే ఎప్పటికప్పుడు పూడ్చేవారు. ప్రస్తుతం మోకాళ్ల లో తు వరకు గుంతలు పడినా సంబంధిత అధికారులకు కనీసం చీమకుట్టినట్లు కూడా కా వడంలేదనీ, ఈ రోడ్ల సంగతి చెప్పుకుంటే గ మ్మతిగా ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
జహీరాబాద్ నియోజకవర్గంలోని మొగుడంపల్లి, నాల్కల్, జర సంఘం కో హిర్ జహీరాబాద్ తదితర ప్రాంతాల్లో రోడ్ల దుస్థితి ఆయా ప్రాంతాల రోడ్లపై వెళ్ళాలన్నా వాహనచోధకులు ప్రధానంగా ప్రయాణికు లు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది ప్రధానంగా న్యా ల్కల్ మండలంలోని హతునూర్, శంషాల్లాపూర్, మలిగి, వడ్డీ, హదునూర్,
ఇబ్ర హీంపూర్, రాఘవాపూర్, చాలికి, కాకిజనవాడ, చీకుర్తి, హుస్సేన్‌నగర్, అమీన్‌పూ ర్ తదితర గ్రామాల ప్రధాన రహదారులు పూ ర్తిగా దెబ్బతిన్నాయి. గత పది సంవత్సరాల నుంచి ఆయా రోడ్ల గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయా రోడ్లపై ఏర్పడిన గుంతల ను పూడ్చడం లేదు. కనీసం మొరంమట్టి కూడా వేయడం లేదు.
డాంబర్ రో డ్డుపై ను ంచి ఎగిరిపోయింది. దీంతో ఆయా రహదారులపై నుంచి నడవలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా న్యాల్కల్ నుండి బీదర్ వెళ్లేందు కు వేసిన రహదారి పూర్తిగా ధ్వంసమయి ంది. ఈ రహదారి గుండా అప్పట్లో నారాయణఖేడ్, బీదర్ బస్సులు నడిచేవి. ప్రస్తు తం ఆ బస్సులు నడవడం లేదు. దీంతో ప్ర యాణికులు అనేక ఇబ్బందులు గురికావా ల్సి వస్తోంది.
రోడ్లు వేసి బస్సులు నడిచే వి ధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కో రుతున్నారు. న్యాల్కల్ నుండి రెండు కిలోమీటర్ల మేర రోడ్డు వేసినప్పటికీ మిగతా రోడ్డు వేయకపోవడం వల్ల ఆ రోడ్డు గుండా వెళ్లే వాహనదారులు అనేక ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. ముఖ్యంగా పెద్ద శంక రంపేట నుండి నారాయణఖేడ్, న్యాల్కల్ నుండి కర్ణాటక రాష్ట్రం బీదర్ వెళ్లే సరిహద్దు వరకు మంజూరైన జాతీయ రహదారి పను లు గత రెండు సంవత్సరాల నుంచి నిలిపివేశారు.
బీదర్, మలిగి వెళ్లే వారికి అనేక ఇబ్బ ందులకు గురి కావలసి వస్తుంది. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, అధికారులు జాతీయ రహదారి పనులు పూర్తి చేసినట్లయితే న్యా ల్కల్ మండలం నుండి బీదర్ వెళ్ళే ఆయా గ్రామాల ప్రజలకు అనువుగా ఉంటుంది.