ధర్మాన్ని పాటిద్దాం
మానవసేవే మాధవసేవగా అహింసా మార్గంలో పయనించాలి
- నిస్వార్థ కోరికలను భగవంతుడు తీరుస్తాడు: మైసూరు దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి
- మంథని, కాటారంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు
- ధన్వాడ దత్తాత్రేయ స్వామి ఆలయంలో మహాపూర్ణాహుతి యజ్ఞం
- వేద పుత్రులకు నిలయం మంత్రపురి: మంత్రి శ్రీధర్‌బాబు
- స్వామివారి ఆశీస్సులందుకున్న విజయక్రాంతి దినపత్రిక చైర్మన్ సీఎల్ రాజం, ఎండీ విజయరాజం దంపతులు
మంథని, నవంబర్ 1 (విజయక్రాంతి): భగవంతుడు సర్వాంతర్యామి(God is omnipresent) అని, ఆయనకు అనేక రూపాలు, కోటానుకోట్ల పేర్లు ఉన్నాయని, ఏ రూపంలో స్మరిం చినా భక్తులకు అనుగ్రహించి వారి కోరికలు తీరుస్తారని అవధూత మైసూర్ దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ(Head of the Mysore Datta Peetham, Sri Ganapathy Sachchidananda Swamiji) అన్నారు.
అయితే భక్తులు కోరుకునే కోరికలు నిస్వార్థమైనవి, సహేతుకమైనవిగా ఉం డాలని హితవు పలికారు. భక్తి మార్గంలో నడుస్తూ ధర్మాన్ని ఆచరిస్తే జీవితంలో విజ యం సాధించవచ్చని, మానవసేవే మాధవసేవగా భావించి అహింసా మార్గంలో పయనించాలని పిలుపునిచ్చారు.
ఆదివారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆహ్వానం మేరకు భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడతో పాటు పెద్దపల్లి జిల్లా మంథనిలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో స్వామీజీ పాల్గొని భక్తులకు దివ్య ప్రవచనం చేశారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో ధన్వాడకు చేరు కున్న స్వామీజీకి మంత్రి శ్రీధర్‌బాబు హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం పలికారు.
అనంతరం మంత్రి నివాసానికి చేరుకున్న స్వామీజీ, ధన్వాడలోని దత్తాత్రేయ స్వామి ఆలయం లో లోకకల్యాణార్థం నిర్వహించిన మహాపూర్ణాహుతి యజ్ఞంలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులను ఉద్దేశించి ప్రవచనం చేశారు. భగవంతుడు ఎక్కడో లేడని, ప్రతి ఒక్కరి హృద యంలోనే కొలువై ఉంటాడని స్వామీజీ పేర్కొన్నారు.
భక్తులు పూలతో పూజించి, నైవేద్యం సమర్పిస్తారని, భక్తితో సమర్పించిన నైవేద్యాన్ని భగవంతుడు సూక్ష్మరూ పంలో స్వీకరిస్తారని వివరించారు. భగవంతుడికి జయం అవసరం లేదని, ఆయనను విశ్వసించే భక్తులకు విజయాన్ని ప్రసాదిస్తారని అన్నారు. దేవుడిని కుటుంబ సభ్యుడిగా భావించి మనస్ఫూర్తిగా ఆరాధించాలని సూచించారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా భగవంతుడిపై విశ్వాసాన్ని కోల్పోకుం డా ధర్మాన్ని పాటిస్తూ ముందుకు సాగాలని భక్తులకు సచ్చిదాదనంద స్వామి హితవు పలికారు.
బ్రిటిష్ కాలం నాటి తిరుపతి కథ..
భగవంతుడి మహిమను వివరిస్తూ బ్రిటి ష్ పాలన కాలంలో తిరుపతిలో జరిగిన ఓ సంఘటనను భక్తులకు సచ్చిదాదనంద స్వామి స్వామీజీ వివరించారు. అప్పట్లో తిరుమల శ్రీవారికి సమర్పించే నైవేద్యాన్ని అర్చకులే తింటున్నారం టూ ఓ కలెక్టర్ అనుమానం వ్యక్తం చేశారని తెలిపారు.
ఈ విషయాన్ని నిరూపించేందు కు ప్రధాన అర్చకుడు ఇతర అర్చకులతో కలిసి కలెక్టర్ సమక్షంలోనే నైవేద్యాన్ని సమర్పించారని చెప్పారు. తెర లేకుండా పూజలు నిర్వహించిన అనంతరం నైవేద్యాన్ని పరిశీలించిన కలెక్టర్‌కు ముందుగా సమర్పించిన ఆహారానికి, తర్వాత తీసుకొచ్చిన నైవేద్యానికి తేడా కనిపించిందని వివరించారు.
దీం తో భగవంతుడి మహిమను గుర్తించిన కలెక్టర్ అర్చకులను అభినందించారని స్వామీజీ తెలిపారు. ఈ సంఘటన ద్వారా భగవంతుడి లీలలు అపారమని, ఆయన సర్వాం తర్యామి అని భక్తులకు సచ్చిదాదనంద స్వామి వివరించారు.
పులకించిన మంథని గడ్డ..
ధన్వాడలో కార్యక్రమం ముగిసిన అనంతరం స్వామీజీ రోడ్డు మార్గంలో మంథనికి చేరుకున్నారు. పట్టణంలోని శివకిరణ్ గార్డెన్స్‌లో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులకు దర్శనమిచ్చి ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. స్వామివారి రాకతో మంథని ప్రాం తమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వేలాదిమంది భక్తులు భక్తిశ్రద్ధలతో తరలివచ్చి స్వామివారి దివ్య ఆశీస్సులు పొందారు.
దత్తావతారంగా దర్శనమిస్తున్నారు: మంత్రి శ్రీధర్‌బాబు
శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి పాదస్పర్శతో ఈ ప్రాంతం పావనమైందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మైసూర్లో దత్త పీఠం స్థాపించి దత్తావతారంగా వెలుగొందుతున్న స్వామివారి దివ్య ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకు లభించడం ఎంతో సంతోషం కలిగిస్తుందన్నారు.
ఈ ప్రాంత ప్రజలకు దర్శనమివ్వాల ని కోరగానే వచ్చిన స్వామివారికి ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు పాదాభివందనాలు తెలియజేశారు. ‘నేను ఒకానొక సందర్భంలో మైసూర్ వెళ్లి స్వామి వారిని దర్శించుకోవడానికి మూడు నాలుగు రోజులు వేచి ఉండేవాడినని దర్శనం దొరికిన తర్వాత నా ఆనందానికి అవధులు లేకుండా ఉండేది’ అని మంత్రి అన్నారు.
మా అమ్మగారు మా కుటుంబ సభ్యులము ప్రతి సంవత్సరం స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకుంటూ జన్మను సార్థకం చేసుకుంటున్నామని తెలిపారు. మంత్రపురి వేద పం డితులకు నిలయమని వేలాది సంవత్సరాలుగా వారు చేస్తున్న పూజలు హోమాల వల్ల ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని మంత్రి వెల్లడించారు.
సీఎం రేవంత్‌రెడ్డి, ఎండోమెంట్ శాఖ ఈ రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తున్న విషయాన్ని మంత్రి శ్రీధర్‌బాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మంత్రపురి ప్రాంతానికి దర్ప ణం పడుతుందన్నారు. రాష్ట్రంలోని బాసర, ధర్మపురి, వేములవాడ, కాలేశ్వరం,
భద్రాచలం ఆలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నట్టు వెల్లడించారు. రాబోయే గోదావరి నది, ఆ తర్వాత వచ్చే కృష్ణానది పుష్కరాలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ భక్తుల సౌకర్యార్థం వేలాదికోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు దుద్దిళ్ల మారుతి, రామడుగు శ్రీరాములు, రామడుగు అంబదాసు,
ఒజ్జల గణేష్, అచలాపురపు శ్రీని వాస్, మారుపాక ప్రశాంత్, ప్రభుత్వ విప్ విజయ రమణారావు, రామగుండం ఎమ్మె ల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్, రాష్ట్ర రెవె న్యూ అండ్ ఎండోమెంట్ కమిషనర్ శైలజ రామయ్యార్, డైరెక్టర్ హనుమంతరావు, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, విజయక్రాంతి దినపత్రిక చైర్మన్ చిలప్పగారి లక్ష్మీరాజం,
యాదాద్రి ట్రస్టు బోర్డు సభ్యురాలు విజయ రాజం, స్వర్గీయ శ్రీపాదరావు సతీమణి దుద్దిళ్ల జయమ్మ, పీసీసీ ప్రధాన కార్యదర్శి దుదిళ్ల శ్రీను బాబు, మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సయేందర్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఐలి ప్రసాద్, రాష్ట్ర విద్యుత్ బోర్డ్ నియంత్రణ మండలి సభ్యులు శశిభూషణ్ కాచే,
కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముస్కుల సురేందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమాదేవి సురేష్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి మూల సరోజన పురుషోత్తం రెడ్డి, మాజీ ఎంపీపీ కొండ శంకర్, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉప్పట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.