ఆసుపత్రి చుట్టూ జడ్చర్ల రాజకీయం
- సవాళ్లు ప్రతి సవాళ్లకే పరిమితమైన ఆ నియోజకవర్గం
- ఆరు నెలల్లో కోపారి తెరపైకి జడ్చర్ల ఆసుపత్రి పై తీవ్ర చర్చ
- ఆసుపత్రికి వాస్తు దోషం ఉందా? సిబ్బంది లేరంటున్నా మాజీ మంత్రి
- చేయాల్సిన పనులు ఆమడ దూరంలో అంటున్న జనం
- కౌంటర్ ప్రతి కౌంటర్లతో రాజకీయ రగడ.. ముగింపు పడేనా?
జడ్చర్ల, నవంబర్ 1 : ఉమ్మడి జిల్లాలోని జడ్చర్ల నియోజకవర్గం(Jadcherla Constituency) కేవలం ఒకే సమస్యపై గత మూడేళ్లుగా తీవ్ర చర్చ ఊపందు కుంటుంది. ప్రకృతి వైపరీత్యాల లో భాగం గా ఒక మారు జడ్చర్ల ఆసుపత్రికి వర్షపు నీ రు చేరింది అంటూ మాజీ మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి చెబుతున్న మాట. అభివృద్ధిని మ రిచి కేవలం ఆరోపణలకే పరిమితమయ్యారంటూ ఆసుపత్రిలో అవసరమైన గదులు అందుబాటులో ఉన్నప్పటికీ వైద్య సేవలు అందించేందుకు సిబ్బంది సరిగా లేరంటూ ప్రతిపక్ష పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
ఇక్క డే వైద్య సదుపాయాలు అందించేందుకు అవకాశం ఉన్నప్పటికీ పెద్ద ఆసుపత్రికి రెఫర్ చేస్తూ ఉన్న ఆస్పత్రిలో వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందించడం లేదంటూ అసహ నం వ్యక్తం చేస్తుండ్రు. కేవలం గత మూడేళ్ల నుంచి వంద పడకల ఆసుపత్రి పైనే ఎమ్మె ల్యే అనిరుద్ రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ సి ల క్ష్మారెడ్డి సవాల్ ప్రతి సవాల్ చేసుకుంటుండ్రు.
ఆ భూమి కేటాయిస్తే ఆసుపత్రి నిర్మిస్తానంటున్న మాజీ మంత్రి
ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సవాళ్లను స్వీకరిస్తున్నానని వైద్య ఆరోగ్య శాఖకు మూడు ఎకరాల 20 గుంటల భూమి కేటాయిస్తే శ్వే తా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తాము సొంత డబ్బులతో ఆసుపత్రి నిర్మించి ఇస్తానంటూ జడ్చర్ల ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా మాజీ మంత్రి చెప్పారు. ఈ విషయం తో పాటు ఉన్న ఆసుపత్రిలో వైద్య సిబ్బందిని ఉంచకుండా కేవలం ఆరోపణలు చేసుకుం టూ కాలం గడుపుతున్నారని అభివృద్ధిని అ స్సలు పట్టించుకోవడం లేదంటూ మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తుండు.
ఈ విష యం మీడియా ద్వారా బహిర్గతమైన వెంట నే ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అదే రోజు కూడా ప్రతి సవాల్ విసురుతున్నారు. దీంతో జ డ్చర్ల నియోజకవర్గం ప్రజలు అసలు ఏమి జరుగుతుంది నియోజకవర్గంలో అంతుచిక్కని ప్రశ్నగా ఇదే విషయాన్ని చర్చించు కుంటుండ్రు.
చేయాల్సిన పండంటి చేస్తున్నదేమిటి?
అసలే వర్షాలు కురవక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ తరుణం లో ప్రజలకు భరోసా ఇచ్చేది మరిచి ఎమ్మె ల్యే సవాల్ విసురుతూ కేవలం ఓ చర్చ జరిగేలా చేయడం వెనుక ఉన్న అంతర్ ఏ మేమిటని జనం ప్రశ్నిస్తున్నారు. ఈ ఆరోపణలతో జనానికి వచ్చేదేముందంటూ అస హనం వ్యక్తం చేస్తుండ్రు.
ఇకనైనా ఈ చర్చకు ముగింపు పలికితే అభివృద్ధిపై ప్రత్యేక అడుగులు వేయాల్సిన అవసరం ఎంత ఉంది అంటూ ప్రజలు చెబుతున్న మాట. ఇది అధికార పార్టీ అడుగులు వేస్తుందా? చర్చ ప్రతి చర్చ అంటూ కాలయాపన చేస్తుందా?
వేచి చూడాలంటూన్నారు జడ్చర్ల నియోజకవర్గ ప్రజలు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రత్యేకంగా ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అభివృద్ధిని వేగవంతంగా తీసుకుపోవాలని వారు కోరుతున్నారు. మాజీ మంత్రి సవాల్ మేరకు వైద్య ఆరోగ్యశాఖకు ఆ భూమి కేటాయిస్తూ అందిస్తే సొంత నిధులతో ఆసుపత్రి నిర్మాణం చేపట్టిన నియోజకవర్గ ప్రజలకు మేలు జరుగుతుందని వారు చెప్తున్నారు.