నిబంధనలు పాతర? అక్రమాల జాతర!

02-11-2026 | 05:20am
  1. క్రాకర్స్ అమ్మకాల్లో నిబంధనలు తూచ్.?
  2. చోద్యం చూస్తున్న అధికారులు 

భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 1 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో(Bhadradri Kothagudem District) 365 రోజులు క్రాకర్స్ అమ్మకాల్లో నిబంధనలను పాతర పెట్టి... అక్రమాల జాతర(Carnival of Malpractice) కొనసాగుతోందని తేటతెల్లమవుతుంది. జిల్లావ్యాప్తంగా  365 రోజుల క్రాకర్స్ అమ్మకాలకు 3 దుకాణాలకు పేలుడు పదార్థాల నియంత్రణ అధికారుల నుంచి అనుమతులను ప్రభుత్వం మంజూరు చేసింది.

క్రాకర్స్ అమ్మకాలకు  షరతులతో కూడిన అనుమతులను మంజూరు చేశారు. అనుమతులు మంజూరు చేసిన సంబంధిత శాఖ అధికారులు అమలు పై దృష్టి సారించకపోవడం శోచనీయం.  షాపు యజమానులు నిబంధనలను తుంగలో తొక్కి లాభాలే లక్ష్యంగా విక్రయాలు కొనసాగిస్తున్నారు. పాల్వంచ పట్టణంలోని కుంటి నాగులగూడెం, కొత్తగూడెం పట్టణంలో, అశ్వరావుపేట లో అనుమతులు పొంది ఉన్నారు.

పాల్వంచ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర క్రాకర్స్ దుకాణంపై సమాచార హక్కు ద్వారా సేకరించిన వివరాల ప్రకారం  365 రోజుల క్రాకర్స్ నిబంధనలను పరిశీలిస్తే ఏ ఒక్క దుకాణం యజమాని నిబంధనలో పాటించటం లేదని తేటతెల్లమవుతోంది. క్రాకర్స్ అమ్మకాల నుంచి మొదలుకొని మున్సిపాలిటీ అధికారులు ఇచ్చిన భవన నిర్మాణం,

తూనికలు కొలతలు, బాల కార్మికుల వ్యవస్థ, అగ్నిమాపక శాఖ నిబంధనలు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నిబంధనలను సైతం తుంగలో తొక్కి అక్రమ క్రాకర్స్ వ్యాపారాన్ని మూడు తారాజువ్వలు... ఆరు ఆటం బాంబులుగా విక్రయాలు సాగుతున్నాయి. సంబంధిత శాఖ అధికారులు మామూళ్ల మత్తులో తోలుతూ నిబంధనలు పాటించకున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల అనేక ఆరోపణలు వెలబడుతున్నాయి.

మున్సిపల్ అనుమతులకు మంగళం 

వెంకటేశ్వర క్రాకర్స్ విక్రయాలకు మున్సిపల్ అధికారులు ఇచ్చిన అనుమతులను నిర్వాహకులు మంగళం పాడారు. మ్యాప్ లో సోపిన అనుమతులకు భిన్నంగా నిర్మాణాలు జరిపి బాణాసంచా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. మున్సిపల్ అధికారులకు ఇచ్చిన మ్యాపు ప్రకారం ముందు రెండు గదులు, వెనుక వైపు ఎఫ్ డబ్ల్యూ ఫ్లోర్ రూమ్ నిర్మంచాల్సి ఉంది.

మూడు గదులకు ఎలాంటి పైకప్పు వేయకుండా ఓపెన్ గా ఉంచాలని నిబంధనలపై మున్సిపల్ అధికారులు అనుమతులు మంజూరు చేశారు. సదరు దుకాణపు యజమానులు మూడు గదులపై నిబంధనలకు విరుద్ధంగా రేకుల షెడ్డుతో పైకప్పు వేసి వ్యాపారాలు పే షరతుగా చేస్తున్న మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం లో అంతర్యం ఏమిటి.

వ్యాపారుల నుంచి దండిగా ముడుపులు దండుకొంటూ, నిబంధనలను తుంగలో తొక్కిన మాకేంటి పని అంటూ వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమాద వశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటే అందుకు బాధ్యు లు ఎవరని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇచ్చిన అనుమ తులను అతిక్రమించి నిర్మించిన నిర్మాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు