ట్రూ అప్ చార్జీల వడ్డన ప్రారంభం

02-11-2026 | 05:30am
  1. ప్రజలపై విద్యుత్ సంస్థల భారం
  2. 29 నెలలపాటు అదనపు చార్జీలు వసూలు!

మహబూబాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): గృహ విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ సంస్థలు(Electricity Companies) ఇందన వ్యయ సర్దుబాటు(Cost adjustment) (ట్రూ అప్) పేరుతో అదనపు చార్జీల వసూ లు కార్యక్రమానికి ఆదివారం శ్రీకారం చు ట్టాయి. 2022 లో గృహ విద్యుత్ వినియోగదారులు ఆయా నెలల్లో వినియోగించి న విద్యుత్తుకు యూనిట్‌కు 30 పైసలు చొ ప్పున ఆదివారం నుంచి విద్యుత్ బిల్లులో వడ్డన ప్రారంభించారు.

29 నెలలపాటు ఈ విధంగా ఇంధన వ్యయ సర్దుబాటు అదనపు చార్జీలు వసూలు చేయనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే గృహ జ్యోతి పథకంలో నిరుపేదలకు 200 యూ నిట్ల ఉచిత విద్యుత్తు వినియోగదారులకు మాత్రం, అదనపు చార్జీలను కూడా కలిపి ప్రభుత్వమే చెల్లిస్తుండటంతో 200 యూని ట్ల వరకు వినియోగించిన నిరుపేదలకు జీరో బిల్లు యధావిధిగా వస్తోంది. 200 యూని ట్లు దాటిన వారికి, అలాగే గృహజ్యోతి పరిధిలో లేని గృహ వినియోగదారులకు మా త్రం ట్రూ అప్ చార్జీల భారం వడ్డిస్తున్నారు. 

బిల్లు తక్కువ.. అదనపు బాదుడు ఎక్కువ!

విద్యుత్ వినియోగానికి వచ్చే ఛార్జీకి రెట్టింపు అదనపు చార్జీల బాదుడు ఎక్కువైందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఉదాహరణకు ఓ వినియోగదారుడు 12 యూనిట్ల విద్యుత్తును వినియోగించగా అతడికి 140 రూపాయల బిల్లు వేయగా, ఎనర్జీ చార్జి కింద రూ.23.40, పిక్స్ చార్జి కింద పది రూపాయలు, కస్టమర్ చార్జీల కింద 40 రూపాయలు,

ఎలక్ట్రిసిటీ డ్యూటీ కింద 72 పైసలు, ఇంట్రెస్ట్ ఈడీ కింద రెండు పైసలు, తాజాగా ట్రూ అప్ చార్జీల కింద 55 రూపాయలు వేరసి 162 అదనపు చార్జీలు కలిపి మొత్తంగా 302 రూపాయల బిల్లు వచ్చింది. దీనితో ఇప్పటికే అదనపు చార్జీల భారం పడుతుండగా, తాజాగా ట్రూ అప్ చార్జీల వడ్డన భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజలపై ఎంపకీ భారం?: శంతన్ రామరాజు 

తెలంగాణ ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీల పట్ల జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శంతన్ రామరాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా కాలం నుంచి ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా కుదేలయ్యాయని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలంగాణలో ఎల్ నినో ఫలితంగా వర్షాభావ పరిస్థితిలు ఏర్పడి ప్రజలు కరువు కోరల్లో చిక్కుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

ఇలాంటి దుర్భర పరిస్థితిల్లో విధ్యుత్ చార్జీల పెరుగుదల సామాన్య ప్రజలు, రైతులు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఆశనిపాతమన్నారు. ట్రూ అప్ చార్జీల రూపంలో 7,635కోట్లు డిస్కమ్ లు వసూలు వసూలు చేస్తున్నాయని, టీజీఎస్పీడీఎల్ పరిధిలో 2029 మార్చి వరకు, టీజీ ఎన్ పీడీసీఎల్ పరిధిలో 2028 డిసెంబర్ వరకు ఈ అదనపు చార్జీల వడ్డన ఉంటుందన్నారు.

ఏవిధంగా చూసినా ఈ పెరుగుదల రోజువారీ జీవన వ్యయంఫై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. విద్యుత్ చార్జీల పెంపు అమలుపై ప్రభుత్వం పునరాలోచన చెయ్యాలని శంతన్ రామరాజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు