జిల్లాస్థాయి క్విజ్ పోటీలకు ముగ్గురు విద్యార్థులు ఎంపిక
చేగుంట, నవంబర్ 20 -విజయక్రాంతి : చేగుంట మండలంలోని(Chegunta Mandal) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల(Zilla Parishad High) విద్యార్థులకు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్(District Collector Pratima Singh) ఆదేశాల మేరకు శుక్రవారం స్థానిక ఆదర్శ పాఠశాలలో జీనియస్ క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ క్విజ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి చేగుంట మండలం నుంచి జిల్లాస్థాయికి ఎంపికైనట్లు మండల విద్యాధికారి నీరజ, క్విజ్ ఇంచార్జ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కృష్ణారావు తెలిపారు.
ఈ సందర్భంగా ఎంఈఓ నీరజ మాట్లాడుతూ, క్విజ్ పోటీలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లోని విజ్ఞానాన్ని వెలికి తీయవచ్చని, విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుందని, భవిష్యత్తులో ఉద్యోగాలు సాధించడానికి చక్కటి అవకాశం ఉంటుందని అన్నారు.
మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులు ఈ నెల 26న జిల్లా స్థాయిలో జరిగే సెమీఫైనల్స్ క్విజ్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఎంఈఓ నీరజ, క్విజ్ ఇంచార్జ్ కృష్ణారావు బహుమతులు ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ చంద్రకళ, క్విజ్ ఉపాధ్యాయులు రావుల వెంకటేష్, శ్రీనివాస్, దేవరాజ్, టెక్నికల్ ఆఫీసర్లు చరణ్ దాస్, పులి రమేష్, సంతోష్ రెడ్డి, గైడ్ టీచర్లు చల్లా లక్ష్మణ్, గందే పాండు, ప్రభాకర్, మహేందర్ రెడ్డి, యాదగిరి, వీణ, సంధ్యారాణి, రాజశేఖర్, రవిబాబు తదితరులు పాల్గొన్నారు.