రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఉపాధ్యాయురాళ్ళు మృతి
- స్కూటీని ఢీ కొట్టిన టిప్పర్.
- అక్కడికక్కడే ఇద్దరు మృతి.
- సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని బీబీగూడెం వద్ద ఘటన
సూర్యాపేట, నవంబర్ 20 (విజయక్రాంతి) : ఇద్దరు ఉపాధ్యాయురాలు(Female teacher) వెళ్తున్న స్కూటీని టిప్పర్ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సూర్యాపేట మున్సిపాలిటీ(Suryapet Municipality) పరిధిలోని బీబీగూడెం వద్ద శుక్రవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండలంలోని మినీ గురుకుల పాఠశాలలో(Residential School) ప్రిన్సిపాల్ గా విధులు నిర్వహిస్తున్న కోట్ల రజిత, అదే పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న పిల్లల జగ్గుతండాకు చెందిన గుగులోతు రక్మలు ద్విచక్ర వాహనం (స్కూటీ)పై చివ్వెంల గురుకుల పాఠశాల నుంచి సూర్యాపేటకు బయలుదేరారు.
ఈ క్రమంలో బీబీగూడెం సమీపానికి చేరుకోగానే ఎదురుగా వేగంగా వచ్చిన ఏ మిక్స్ కంపెనీకి చెందిన టిప్పర్ వారి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికిచేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. కాగా ఒకే గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ప్రిన్సిపాల్, ఉపాధ్యాయురాలు ఒకే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో పాఠశాలలో విషాదం అలుముకుంది.