కొల్లాపూర్ లో హై టెన్షన్..!

21-11-2026 | 12:15am

- పండుగ సాయన్న విగ్రహ ఏర్పాటులో తగ్గేదేలే అంటున్న ఇరు పార్టీలు.

- అధికార కాంగ్రెస్, బిజెపి పార్టీల పోటా పోటీ పోటీ.

- మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి చేతుల మీదుగా ఒక విగ్రహం.

- మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ చేతుల మీదుగా మరో విగ్రహం.

- ఒకే చోట రెండు విగ్రహాల ఆవిష్కరణకు వేరు వేరుగా ఏర్పాట్లు.

- పికెటింగ్ ఏర్పాటు చేసిన పోలీస్ అధికారులు.

నాగర్ కర్నూల్ నవంబర్ 20 ( విజయక్రాంతి ): నాగర్ కర్నూలు జిల్లా(Nagarkurnool District) కొల్లాపూర్ నియోజకవర్గంలో(Kollapur constituency) పండుగ సాయన్న విగ్రహ ఆవిష్కరణ(Panduga Sayanna Statue ) అంశంలో రాజకీయ పార్టీల(political parties) మధ్య ఏర్పడ్డ వివాదంతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కొల్లాపూర్ నియోజక వర్గం కల్వకోల్ గ్రామంలో ముదిరాజు సామాజిక వర్గం తమ ఆరాధ్య దైవంగా భావించే పండుగ సాయన్న విగ్రహ ఏర్పాటుకు సిద్ధమైన విషయాన్ని పసిగట్టిన అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) తానే స్వయంగా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడంతో అసలు రాజకీయం మొదలైంది.

ముదిరాజ్ సామాజిక వర్గానికి మద్దతుగా తెరవెనక బిఆర్ఎస్ బిజెపి ముఖ్య నేతలు సపోర్ట్ ఇవ్వడంతో గురువారం రాత్రి కల్వకోల్ గ్రామంలో పండుగ సాయన్న విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు ఏర్పాటు చేశారు. అందుకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా పండుగ సాయన్న విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లకు సిద్ధం చేయగా ముదిరాజులకు మద్దతుగా తెరవెనక ఉన్న రాజకీయ నేతలు వచ్చేనెల పండుగ సాయన్న వర్ధంతి రోజున ఆవిష్కరిస్తామని చెప్తూనే మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఇతర బిజెపి నేతలు పండుగ సాయన్న విగ్రహ ఆవిష్కరణకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

శనివారం రోజు ఎంపీ ఈటెల రాజేందర్(Etela Rajender) తో పాటు రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి పర్యటన ఉన్నట్లు షెడ్యూల్ ఖరారు కావడంతో ప్రస్తుతం కొల్లాపూర్ ప్రాంతంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రెండు విగ్రహాలు ఒకే రోజు ఆవిష్కరించేందుకు తగ్గేదే అంటూ రెండు పార్టీలు సిద్ధమవుతుండడంతో పోలీసులకు ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామాల్లో, నియోజకవర్గ కేంద్రంలో పోలీసు బందోబస్తు పటిష్టం చేశారు.

మరిన్ని వార్తలు