పాత బజారులో ఎమ్మెల్యే విస్తృత పర్యటన
రూ.6 కోట్లతో అభివృద్ధి పనులు
"త్వరలోనే సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభం"
జడ్చర్ల, నవంబర్ 21: జడ్చర్ల పట్టణంలోని(Jadcherla town) పాత బజారు ప్రాంతంలో 6, 7, 21, 22, 23 వార్డుల్లో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి(Jadcherla MLA Janampalli Anirudh Reddy) శనివారం విస్తృతంగా పర్యటించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఆయా వార్డుల్లో పర్యటిస్తూ సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ(CC roads and drainage system) పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాత బజారు ప్రాంత అభివృద్ధికి రూ.6 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. త్వరలోనే సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. పాత బజారు ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.