కౌకుంట్ల-ఇస్రంపల్లి వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి సర్వే
24-11-2026 | 04:00pm
కౌకుంట్ల, నవంబర్ 24: కౌకుంట్ల – ఇస్రంపల్లి గ్రామాల మధ్య ఉన్న వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి(Bridge construction) సంబంధించి సర్వే నిర్వహించేందుకు వచ్చిన డీఈ (D.E.) లక్ష్మణ్ గారితో కలిసి కౌకుంట్ల సర్పంచ్ ఉల్లి నరేష్ కుమార్ వాగు పరిసరాలను పరిశీలించారు.
ఈ బ్రిడ్జి నిర్మాణంతో వర్షాకాలంలో రాకపోకల ఇబ్బందులు తొలగి రైతులు, విద్యార్థులు, ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) పనులను డీఈతో కలిసి పరిశీలించిన సర్పంచ్, నిర్మాణంలో వేగం పెంచి త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను కోరారు.