ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ

24-11-2026 | 03:57pm

పొనకల్‌లో ప్రత్యేక శిబిరం ప్రారంభం...

జన్నారం, (విజయ క్రాంతి) : మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్ గ్రామ పంచాయతీలో(Ponakal Gram Panchayat) తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ కోసం గ్రామ సర్పంచ్ జక్కు సుష్మ-భూమేష్ ప్రత్యేక శిబిరాన్ని మంగళవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అర్హులైన కుటుంబాలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందన్నారు.

ప్రభుత్వం ఉచితంగా అందించే ఈ జీవిత బీమా పథకానికి 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు అర్హులన్నారు. లబ్ధిదారులు ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది నామినీలను ఎంపిక చేసుకునే అవకాశం ఉందని, అర్హత కలిగిన ప్రతి కుటుంబం తప్పనిసరిగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకుని జీవిత బీమా రక్షణ పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అప్పల జలపతి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు