నిజమైన అర్హులందరికీ పెన్షన్ అందేలా కృషి చేస్తాం

18-11-2026 | 06:15pm

వెన్నచేడ్‌లో నూతన పెన్షన్ లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ

గండీడ్: నవంబర్ 18 విజయక్రాంతి : మండల పరిధిలోని వెన్నచేడ్ గ్రామపంచాయతీ కార్యాలయం(Vennachedu Gram Panchayat Office) వద్ద నూతనంగా పెన్షన్లు(Pensions) మంజూరైన లబ్ధిదారులకు(Beneficiaries) గ్రామ సర్పంచ్ గుర్రాల నవనీత చెన్నయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంత లక్ష్మారెడ్డి పెన్షన్ ప్రొసీడింగ్స్‌ను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు నిజమైన అర్హులందరికీ అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. కొత్తగా పెన్షన్లు మంజూరైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హత ఉండి పెన్షన్ పొందని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దశలవారీగా అర్హులందరికీ పెన్షన్లు అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ విలేజ్ సెక్రటరీ చెన్నకేశవులు, పీఏసీఎస్ డైరెక్టర్ బోయిని పుష్పలతగోపాల్, పులిందర్ రెడ్డి, పెద్దాపురం చెన్నయ్య,ఆశన్న గౌడ్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు