మహాత్మా జ్యోతిరావు పూలేకు ఘన నివాళులు

28-11-2026 | 05:25pm

 PACS చైర్మన్ పాలెం సుదర్శన్ గౌడ్

జడ్చర్ల, నవంబర్ 28: బహుజనుల ఆశాజ్యోతి, ప్రముఖ సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే(Mahatma Jyotirao Phule) 136వ వర్ధంతిని పురస్కరించుకొని జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బాదేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) చైర్మన్ పాలెం సుదర్శన్ గౌడ్(Palem Sudarshan Goud) ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించిన అనంతరం ఆయన ప్రసంగించారు. సమాజంలోని అసమానతలు, అంటరానితనం మరియు మూఢనమ్మకాల నిర్మూలనకు జ్యోతిరావు పూలే చేసిన కృషి చిరస్మరణీయమని పాలెం సుదర్శన్ గౌడ్ కొనియాడారు. సామాజిక న్యాయం కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని గుర్తు చేశారు. ముఖ్యంగా మహిళా విద్యకు పూలే వేసిన పునాదులు నేటి ఆధునిక సమాజ నిర్మాణానికి ఎంతో దోహదపడ్డాయని పేర్కొన్నారు.

"మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకోవడం మనందరి బాధ్యత. విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని నమ్మిన మహానుభావుడు పూలే. ఆయన చూపిన బాటలో నడుస్తూ, పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి మనమందరం ఐక్యంగా పనిచేయాలి. యువత పూలే ఆశయాలను ఆదర్శంగా తీసుకొని సమాజ సేవలో భాగస్వాములు కావాలి" అని సుదర్శన్ గౌడ్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జడ్చర్ల మాజీ సర్పంచ్ బుక్క వెంకటేశం, పెద్దపల్లి సర్పంచ్ నాగసాల శ్రీనివాస్ యాదవ్, ఖాజాపాష, వెంకటయ్య యాదవ్, లక్ష్మణ్ కుమార్, స్థానిక నాయకులు, రైతులు మరియు అనిరుద్ రెడ్డి అభిమానులు పాల్గొని మహాత్మా జ్యోతిరావు పూలే సేవలను స్మరించుకున్నారు.

మరిన్ని వార్తలు