దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావమే ఆర్ఎస్ఎస్ ఆశయం

14-10-2026 | 02:01pm

మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్: విజయక్రాంతి: మండల కేంద్రంలో(Mandal headquarters) మూడు రోజులపాటు కొనసాగిన ఖండ్ ప్రారంభిక్ వర్గ విజయవంతం గండీడ్:దేశభక్తి, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం,సామాజిక సేవాభావాన్ని పెంపొందించడమే లక్ష్యంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)(Rashtriya Swayamsevak Sangh)ఆధ్వర్యంలో నిర్వహించిన ఖండ్ ప్రారంభిక్ వర్గ మూడు రోజులపాటు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.

మండల కేంద్రంలో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో గండీడ్, కడిరేగూడెం,కోస్గి,గుండుమాల్ మండలాలకు చెందిన దాదాపు వందమంది శిక్షార్థులు పాల్గొన్నారు. వ్యక్తి నిర్మాణమే దేశ నిర్మాణానికి పునాది అనే భావనతో నిర్వహించిన ఈ శిక్షణ వర్గలో స్వయంసేవకులకు శారీరక, మానసిక వికాసానికి సంబంధించిన వివిధ అంశాలపై శిక్షణ అందించారు.

శారీరక వ్యాయామాలు,క్రమశిక్షణ, సమయపాలన,సంఘటిత శక్తి, నాయకత్వ లక్షణాలు,వ్యక్తిత్వ వికాసం వంటి అంశాల ప్రాధాన్యతను వివరించారు. వ్యక్తుల్లో మంచి ఆలోచనలు, క్రమశిక్షణ,సేవాభావాన్ని పెంపొందించి సమాజానికి, దేశానికి మేలు చేసే వ్యక్తులుగా తీర్చిదిద్దడమే ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

వందేళ్ల ప్రస్థానంలో ఆర్ఎస్ఎస్ ఎన్నో మైలురాళ్లను అధిగమించిందని, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపించి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంఘం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఎన్నో సవాళ్లు,ఆటుపోట్లను ఎదుర్కొంటూ సంఘం తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోందని, దేశవ్యాప్తంగా విస్తరించడంతోపాటు విదేశాల్లోనూ భారతీయ సమాజానికి సంబంధించిన పలు కార్యక్రమాలను నిర్వహిస్తోందని పేర్కొన్నారు.వ్యక్తి నిర్మాణం ద్వారా సమాజ నిర్మాణానికి కృషి చేయడమే ఆర్ఎస్ఎస్ ప్రధాన లక్ష్యమని వివరించారు.

స్వయంసేవకుల్లో క్రమశిక్షణ,శీలం, సమయపాలన,సంఘటిత శక్తి, సామాజిక బాధ్యత వంటి లక్షణాలను పెంపొందించడంలో శాఖలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రతిరోజూ ఒక గంటపాటు శాఖలో పాల్గొనడం ద్వారా శారీరక దృఢత్వంతోపాటు మానసిక వికాసం, ఆత్మవిశ్వాసం,నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ అలవడతాయని చాపల శ్రీనివాసులు పేర్కొన్నారు.

సమాజం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. సమాజం కోసం, దేశం కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే స్వయంసేవకులను తయారు చేయాలని పిలుపునిచ్చారు. ప్రకృతి విపత్తులు, సామాజిక అవసరాలు, ప్రజలకు సహాయం అవసరమైన సందర్భాల్లో స్వయంసేవకులు ముందుండి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని తెలిపారు.

సమాజంలో ఐక్యత, పరస్పర సహకారం, సోదరభావాన్ని పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. శిక్షణ కార్యక్రమంలో జిల్లా ప్రచార ప్రముఖ్ స్వయం ప్రకాష్, ఖండ్ కార్యవాహ్ యాదయ్య, బాలకృష్ణ గౌడ్,హర్షిత్ కుమార్, ధర్మ,ఎ.కృష్ణయ్య, బాలకృష్ణ, జి.రాములు, కృష్ణ, మధు గౌడ్,రాంబాబు తదితర స్వయంసేవకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు