సింగరేణి సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ రిలే నిరాహార దీక్ష
మందమర్రి, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి ఏరియా జీఎం కార్యాలయం(Singareni Area GM Office) వద్ద ఏఐటీయూసీ నాయకులు సింగరేణి సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన రెండు రోజుల రిలే నిరాహార దీక్ష బుధ వారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సింగరేణి కార్మికుల 24 పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను యాజమాన్యం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ రిలే నిరాహార దీక్షకు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు సంఘీభావం ప్రకటించి దీక్షలో పాల్గొన్న కార్మికులకు మద్దతు తెలిపారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన పోరాటానికి తన మద్దతు ఉంటుందన్నారు. పెండింగ్లో ఉన్న 24 సమస్యలపై యాజమాన్యం తక్షణమే స్పందించి పరిష్కార చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.