కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అబ్జర్వర్ శామ్ జాన్ పర్యటన

06-11-2026 | 05:18pm

బెల్లంపల్లి: కేంద్ర ప్రభుత్వ సంక్రమణ అసంక్రమణ వ్యాధుల పరిశీలన కోసం సెంట్రల్ వైద్య ఆరోగ్యశాఖ అబ్జర్వర్ డాక్టర్ శ్యామ్ జాన్(Central Health Observer Dr. Shyam John) బెల్లంపల్లిలో పర్యటించారు. బెల్లంపల్లి ఆసుపత్రి, తాళ్ల గురజాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్ తో కలిసి పరిశీలించారు. ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు జాతీయ టీకాల కార్యక్రమన్ని పరిశీలించారు.

పిల్లల్లో కలుగు 12 ప్రాణాంతక వ్యాధులు వాక్సినేషన్ తీరు ను తెలుసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకొనడం ద్వారా వ్యాధులు రాకుండా వ్యాక్సిన్ ప్రివెంటేబుల్ డిసీజెస్ అసంక్రమణ వ్యాధులు డయాబెటిస్ బిపి క్యాన్సర్లు సంక్రమణ వ్యాధులు కీటక జనిత వ్యాధులు నయం అవుతాయని చెప్పారు. ఐడిఎస్పి ఇంటిగ్రేటెడ్ డిసీజెస్ సర్విలిన్స్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో అందిస్తున్న వైద్య సేవల పైన నమోదు,వ్యాధుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

జంతువుల నుండి మనుషులకు సోకే వ్యాధులు జునాటిక్ డిసీజెస్ కుక్క కాటు, పాము కాటుపైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సామాజిక ఆరోగ్య కేంద్రాలు బ్లాక్ లెవెల్ ఆరోగ్య కేంద్రాలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల పైన ప్రత్యక్షంగా సమీక్ష చేశారు.  రికార్డులు, రిపోర్టులను పరిశీలించారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవల పైన సంతృప్తి వ్యక్తం వ్యక్తం చేశారు.

అదేవిధంగా తాళ్ల గురజాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అత్యవసర పరిస్థితులలో కుక్క కాటుకు పాముకాటుకు వ్యాక్సినేషన్ అందించడం, ఆరోగ్య కార్యక్రమాలను ఏ రోజుకు ఆరోజు నమోదు చేయడాన్నీ పరిశీలించారు. ప్రతి బుధవారము శనివారము వ్యాక్సిన్ కార్యక్రమమును సక్రమంగా నిర్వహించడం 100% గర్భవతులకు పిల్లలకు టీకాలు, అందిస్తున్న సేవలు పైన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ వనిత, డాక్టర్ శ్రీధర్ బాబు జిల్లా వైద్య బృందం అల్లాడి శ్రీనివాస్, నాందేవ్, పుట్ట సత్తయ్య, ఆర్ఎస్ పద్మ సుమన్, రషీద్, శ్రీనివాస్ వైద్యులు ఆరోగ్య కార్యకర్తలు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు