రైతు నేస్తం వీక్షించిన రైతులు

09-11-2026 | 10:00pm

హాజీపూర్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) హాజీపూర్ మండలం గుడిపేట రైతు వేదికలో సోమ వారం రైతు నేస్తం కార్యక్రమాన్ని(Rythu Nestham Event) రైతులు వీక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హకీంపేట, కొడంగల్‌లో నిర్వహించిన రైతు ఆత్మీయ సమ్మేళన సభ ప్రత్యక్ష ప్రసారాన్ని వీడియో కాన్ఫరెన్స్(video conference) ద్వారా వీక్షించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ADA (సస్యరక్షణ) గోపి, AMC వైస్ చైర్మన్ జాల లింగన్న, టీకానపల్లి సర్పంచ్ తిరుపతమ్మ, చిన్నగోపాల్‌పూర్ సర్పంచ్ జగనక్ రాజేష్, పశు సంవర్ధక శాఖ AD భూమన్న, హాజీపూర్ AO కృష్ణ, AO తరుణ్, AEO మధుప, రైతులు దొమ్మటి లచ్చన్న, కందుల రమేష్, జువ్వాడి సత్యనారాయణ, లగిశెట్టి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు