పూలమాల, దీపాల వెలుగుల్లో ఆంజనేయస్వామి దర్శనం

09-11-2026 | 10:02pm

భక్తుల్లో ఆధ్యాత్మిక సందడి

ప్రత్యేక అలంకరణలో రాజ ప్రభూ శర్మ....

 శివంపేట్ నవంబర్ 9 (విజయక్రాంతి ) : మెదక్ జిల్లా(Medak District) శివంపేట మండలం చిన్నగొట్టిముక్కుల గ్రామపంచాయతీ(Chinnagottimukkula Grama Panchayat) పరిధిలో కొలువుదీరిన శ్రీ స్వయంభు సహకార ఆంజనేయస్వామి ఆలయంలో(Anjaneyaswamy Temple) స్వామివారికి ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. ఆలయ అర్చకులు రాజ ప్రభు శర్మ ఆధ్వర్యంలో ఆంజనేయస్వామికి విశేష అలంకరణ చేపట్టి, వివిధ రకాల పుష్పమాలలు, పుష్పాలతో స్వామివారిని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ ప్రాంగణాన్ని దీపాలతో అలంకరించి భక్తి(devotees) పారవశ్యం ఉట్టిపడేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

స్వామివారి సన్నిధిలో దీపాలను వెలిగించి భక్తిశ్రద్ధలతో(devotional) పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూలమాలలతో అలంకరించిన ఆంజనేయస్వామి దివ్యరూపం భక్తులను(devotees) విశేషంగా ఆకట్టుకుంది. ఆలయానికి విచ్చేసిన భక్తులు(devotees) స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాలు దీపాల వెలుగులు, ఆధ్యాత్మిక వాతావరణంతో భక్తిమయంగా మారాయి.

ఈ ప్రత్యేక అలంకరణ కార్యక్రమంలో ఆలయ ఈవో సారా శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆలయ అర్చకులు రాజ ప్రభు శర్మ, దేవి ప్రసాద్ శర్మ ప్రత్యేక శ్రద్ధతో నిర్వహించిన అలంకరణ భక్తుల ప్రశంసలు అందుకుంది.

మరిన్ని వార్తలు