ఇందిరమ్మ కుటుంబ భీమా ప్రారంభం

20-11-2026 | 04:25pm

లక్షేట్టిపేట,(విజయక్రాంతి): మండలంలోని కొత్తూరు గ్రామ పంచాయతీ(Kothur Gram Panchayat)లో శుక్రవారం ఇందిరమ్మ కుటుంబ భీమా(Indiramma Family Insurance)పై ప్రజలకు అధికారులు అవగాహన కల్పించి, ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతి కుటుంబానికి అందిస్తున్న భీమా సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్థానిక సర్పంచ్ నల్లపు రజిత, అధికారులు ప్రజలకు వివరించారు.

భీమా వలన కుటుంబానికి ధీమా ఉంటుందని అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి  అవినాష్, ఏఎంసీ చైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు, ఎంపీడీవో అనిల్ కుమార్, వెంకట్రావుపేట సర్పంచ్  నలిమెల రాజు, పాతకొమ్ముగూడెం సర్పంచ్ సత్యం, ఎల్లారం సర్పంచ్ రాజేశం, బియ్యాల తిరుపతి, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు