12వ వార్డులో ఇందిరమ్మ బీమా నమోదు షురూ
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలోని 12వ వార్డులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా (Indiramma Family Life Insurance) నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి షబ్బీర్ పాషా మాట్లాడుతూ.. కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. జీవిత బీమా (Life Insurance) కోసం ప్రభుత్వమే ప్రీమియం (Insurance Premium) చెల్లిస్తుందని తెలిపారు.
వార్డు కౌన్సిలర్ తొడసం ఇందిర చేతుల మీదుగా నమోదు ప్రక్రియ (Registration Process) ప్రారంభమైంది. అర్హులైన కుటుంబాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ రాజు, ఆపరేటర్ అరుణ్, మెప్మా నారాయణ తదితరులు పాల్గొన్నారు.