ఇంటింటికి ఇందిరమ్మ బీమా పేద ప్రజలకు ఇది ధీమా

20-11-2026 | 04:15pm

బోథ్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ భీమా పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో ఎల్. రమేష్ పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలో ఇందిరమ్మ జీవిత బీమా కార్యక్రమాన్ని  ప్రారంభించారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ, ఆత్మ చైర్మన్ లు పాల్గొని ప్రసంగించారు. ఇందిరమ్మ జీవిత బీమా కార్యక్రమం పేద ప్రజలను ఉద్దేశించి ప్రభుత్వం చేపట్టిందన్నారు.

ప్రతి కుటుంబీకుడు లాభం పొందాలన్న దుఃఖంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారన్నారు. అయితే భీమ వల్ల జరిగే లాభాలను అధికారులు గ్రామస్థాయిలో వివరించాలని వారు కోరారు. గ్రామాల్లో ఉండే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా కృషి చేయాలని కోరారు. ప్రతి కుటుంబం ఈ పథకం ద్వారా 5 లక్షల రూపాయల మేరకు లబ్ధి చేకూరుతుందన్నారు కార్యక్రమంలో ఎంపీడీవో తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు నరసింహ దాస్ అచ్యుతానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయితే మరోవైపు ముంచుకొస్తున్న ఎల్ నీ నో ప్రజల వివరించారు తాగునీటి ఎద్దడి ఎదురు కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు కార్యక్రమంలో ఏపీవో జగ్గయ్య రావు ఏపీఎం గణేష్ తోపాటు పలువురు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు