ప్రతి ఇంటికీ ఇందిరమ్మ జీవిత బీమా

20-11-2026 | 04:22pm

గంభీరావుపేట, నవంబర్ 20 (విజయ క్రాంతి): ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా (Indiramma Family Life Insurance) పథకం ప్రధాన లక్ష్యమని ఎంపీడీఓ రాజేందర్ తెలిపారు. గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలోని రైతు వేదికలో సర్పంచ్ రాజబోయిన అర్చన-ఆంజనేయులు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నిమ్మల తిరుపతిగౌడ్‌తో కలిసి బీమా పథకం (Insurance Scheme) దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు.

కుటుంబంలో సంపాదించే వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా (Life Insurance) అందించి ఆర్థికంగా అండగా నిలవడమే ఈ పథకం ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రతి ఇంటి యజమాని, నామినీ, కుటుంబ సభ్యుల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం ప్రయోజనాలు అందేలా నమోదు ప్రక్రియ (Registration Process) పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గొర్రె సుదర్శన్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు రాగుల మహేందర్, నాయకులు మల్లయ్య, నాగయ్య, రవీందర్, పంచాయతీ కార్యదర్శి రూతు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు