సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
మహమ్మదాబాద్,(విజయక్రాంతి): పేద, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందని కాంగ్రెస్ పార్టీ(Congress Party) నాయకులు అన్నారు. మండల పరిధిలోని గాధిర్యాల్ గ్రామానికి చెందిన నలుగురు లబ్ధిదారులకు గురువారం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను(CMRF checks) పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన నీరటి సుమలతకు రూ.13 వేలు, కురువ బాలప్పకు రూ.28 వేలు, పిట్టల ఆనంద్‌కు రూ.38 వేలు, కురువ పద్మమ్మకు రూ.7,500 విలువైన చెక్కులను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జి. చంద్రయ్య, గ్రామ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఇరివింటి వెంకటయ్య, ఉపాధ్యక్షుడు తలారి రాములు అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... ఆర్థిక ఇబ్బందులతో వైద్య ఖర్చులు భరించలేని పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఊరటనిస్తోందన్నారు. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల ఫలాలు అందించడంతో పాటు ఆపద సమయంలో ఆదుకోవడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కే. శ్రీనివాసులు,అంజలయ్య, హనుమంతు,కొత్తపేట శ్రీనివాసులు,జి.రవి, నీరటి శివ,అనిల్‌తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.