జాతీయ స్థాయి ఆత్యాపాత్య పోటీలకు గురుకుల విద్యార్థి

20-11-2026 | 04:21pm

నాగర్‌ కర్నూల్,(విజయక్రాంతి): రాష్ట్రస్థాయి ఆత్యాపాత్య పోటీల్లో(National Atyapatya Competition) ప్రతిభ కనబరిచిన తెల్కపల్లి మహాత్మా జ్యోతిబా ఫూలే బాలుర గురుకుల పాఠశాల విద్యార్థి ఆర్. ప్రభాస్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. అక్టోబర్ 10 నుంచి 12 వరకు జగిత్యాల జిల్లా కోరుట్ల మినీ స్టేడియం(Korutla Mini Stadium)లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పురుషుల, మహిళల ఆత్యాపాత్య పోటీల్లో నాగర్‌ కర్నూల్ జిల్లా జట్టు తృతీయ స్థానం సాధించింది.

జట్టు తరఫున అద్భుత ప్రదర్శన చేసిన ప్రభాస్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. జనవరి 8 నుంచి 10 వరకు ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొననున్నాడు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఈ. చంద్రశేఖర్, పీఈటీ ఎన్. మల్లేష్‌తో పాటు జిల్లా ఆత్యాపాత్య అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్. ప్రసాద్, రాష్ట్ర అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజయ్య, ఉపాధ్యాయులు ప్రభాస్‌ను అభినందించారు.

మరిన్ని వార్తలు