రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఖేలో ఇండియా విద్యార్థులు

20-11-2026 | 04:19pm

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలో ఈ నెల 21 నుంచి 23 వరకు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి జూనియర్ షూటింగ్ బాల్ పోటీల(State Junior Shooting Ball competitions)కు ఆసిఫాబాద్ ఖేలో ఇండియా కేంద్రం విద్యార్థులు ఎంపికయ్యారు. ఆశ్రమ హైస్కూల్ బాలుర పాఠశాల(Ashram High School)లో చదువుతున్న విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు.విద్యార్థులు రాష్ట్రస్థాయిలో రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఎంపికైన విద్యార్థులను DD TW అంబాజీ, DSO షేకు, GCDO శకుంతల, ATDO చిరంజీవి, హెడ్‌మాస్టర్ చంద్రశేఖర్ అభినందించారు. కోచ్ కడతాల రాకేష్, PD అరవింద్, HWO మధుకర్, ఉపాధ్యాయులు జాగేశ్, కిషన్, గోపాల్, కిరణ్, సతీష్, లక్ష్మీనారాయణ, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు